Begin typing your search above and press return to search.

నాగ చైతన్య OTT సిరీస్ డేట్ ఇదేనా?

By:  Tupaki Desk   |   28 April 2022 8:30 AM GMT
నాగ చైతన్య OTT సిరీస్ డేట్ ఇదేనా?
X
వ‌రుస‌గా భారీ ఓటీటీ సిరీస్ ల‌లో న‌టిస్తూ టాలీవుడ్ స్టార్లు బిజీగా ఉన్నారు. ద‌గ్గుబాటి - అక్కినేని కుటుంబ హీరోలు ఓటీటీ విష‌యంలో ముంద‌డుగు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ్ అండ్ డీకే ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తో సాధించిన విజ‌యం అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచింద‌నే చెప్పాలి.

ముఖ్యంగా ఫ్యామిలీమ్యాన్ 2తో స‌మంత‌కు వ‌చ్చిన పేరు చాలా మందిలో స్ఫూర్తి నింపింది. ఆ రేంజులో పేరు తెచ్చే సిరీస్ లు చేయాల‌న్న‌ది అంద‌రి ఆలోచ‌న‌. ఇప్పుడు అక్కినేని కుటుంబ హీరోలు ఈ విష‌యంలో మ‌రింత సీరియ‌స్ గా ఉన్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ కోసం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్‌తో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తాజా నివేదిక ప్రకారం.. ఈ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తుంది.

క‌చ్చితమైన OTT విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ త్వరలో ప్రకటించనుంది. ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో నాగ చైతన్య - ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

చైత‌న్య ఓ వైపు విక్ర‌మ్.కె వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటే త‌దుప‌రి కింగ్ నాగార్జున కూడా ఓటీటీ సిరీస్ లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. వెంకీ- రానా ఇద్ద‌రూ ప్ర‌ఖ్యాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ తో బిజీ కానున్నార‌ని టాక్ వినిపించింది.

అమెరిక‌న్ క్రైమ్ డ్రామా ఆధారంగా రూపొందుతున్న ఈ సిరీస్ కి రానా నాయుడు అనే టైటిల్ ని నిర్ణ‌యించారు. ద‌గ్గుబాటి హీరోల సిరీస్ కి సంబంధించిన మ‌రిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది.