Begin typing your search above and press return to search.
‘సర్కారు వారి పాట’ పాన్ ఇండియా మూవీ అవ్వాలంటే ఇదొక్కటే సమస్య కానుందా?
By: Tupaki Desk | 6 Aug 2020 7:30 AM GMTటాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు అంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల అయితే చరణ్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం. ఇక పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఫైటర్ చిత్రంతో విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ లో తమ అదృష్టంను పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే మహేష్ బాబు కూడా ప్రస్తుతం చేస్తున్న మూవీని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట.
దేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థపై సున్నితంగా విమర్శలు గుప్పిస్తూ వినోదాత్మకంగా రూపొందబోతున్న చిత్రం సర్కారు వారి పాట. సబ్జెక్ట్ ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి అన్ని భాషల వారికి వర్కౌట్ అవుతుంది. అందుకే ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఎక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టైటిల్ ప్రకటించే ముందు సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసే ఆలోచన ఉందో లేదో కాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హిందీలో విడుదల చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలు మొత్తం అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఒకే టైటిల్ ను పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల పబ్లిసిటీ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండటంతో పాటు పలు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. సర్కారు వారి పాట టైటిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. ఇప్పుడు హిందీలో డబ్ చేయాలంటే మరో టైటిల్ ను వెదకాలి. దాంతో మళ్లీ అక్కడ ప్రచారం చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇక్కడ విభిన్నమైన టైటిల్స్ వల్ల టాక్ తేడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి విడుదల సమయానికి టైటిల్ విషయంలో ఏదైనా నిర్ణయం మార్చుకుంటారా లేదంటే పబ్లిసిటీ విషయంలో మరేదైనా మార్గంను ఎంచుకుంటారా చూడాలి.