Begin typing your search above and press return to search.
'మహర్షి' అసలు కథ ఇదేనా?
By: Tupaki Desk | 29 April 2019 6:09 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం 'మహర్షి' విడుదలకు సిద్దం అయ్యింది. మే 9వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రంను భారీ బడ్జెట్ తో రూపొందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఇది మైలు రాయి చిత్రం అవ్వడంతో ఇది ఖచ్చితంగా ఆయన కెరీర్ లో నిలిచి పోయే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా ప్రత్యేకంగా రూపొందించాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం కథ గురించి రకరకాల ప్రచారాలు వినిపించాయి.
స్నేహితుడి కోసం గ్రామంకు వచ్చిన ఒక బిజినెస్ టైకూన్ అక్కడ రైతుల కష్టాలను తొలగించేందుకు ఆధునిక వ్యవసాయంలో వారికి సాయం చేస్తాడు అనేది కథ అంటూ ప్రచారం జరిగింది. సినిమా విడుదల ముందు ఈ చిత్రం కథ గురించి ఇండస్ట్రీలో మరో ప్రచారం మొదలు అయ్యింది. ఈ చిత్రంలో హీరో ఒక విద్యార్థి నుండి రైతుగా, పెద్ద వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు, అతడు అంత కష్టపడటానికి కారణం ఏంటీ, రిషి తన కష్టంతో మహర్షి ఎలా అయ్యాడు అనేది సినిమా కథ అంటున్నారు.
కథ ఏది అయినా, ఎలా ఉన్నా దర్శకుడు వంశీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం బట్టి ప్రేక్షకులు ఇష్టపడటం, తిరష్కరించడం జరుగుతుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న సినిమాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రంకు పలు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మే 1న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మే 9న ఈ చిత్రం ఫలితం ఏంటో తేలిపోనుంది.