Begin typing your search above and press return to search.
ప్రభాస్ సినిమాలకు స్పందన లేకపోవడానికి కారణమిదేనా..?
By: Tupaki Desk | 22 Oct 2022 1:30 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాలను 4K రెజెల్యూషన్ లోకి మార్చి మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో మహేష్ బాబు 'పోకిరి' - పవన్ కళ్యాణ్ 'జల్సా' - నందమూరి బాలకృష్ణ నటించిన 'చెన్న కేశవ రెడ్డి' వంటి చిత్రాలను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
రీ-రిలీజ్ సినిమాలకు అభిమానులు మరియు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. అప్పట్లో థియేటర్లలో ఈ చిత్రాలను చూడలేకపోయిన వారు కూడా ఇప్పుడు ఆ అనుభూతిని పొందడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హీరోలకున్న కల్ట్ ఫాలోయింగ్ కారణంగా మంచి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. దీంతో మిగతా హీరోల సినిమాలను కూడా మళ్ళీ విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలు మళ్లీ విడుదల అవుతున్నాయి. 'బిల్లా' 'వర్షం' మరియు 'రెబల్' సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ చిత్రాలకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. పేలవమైన బుకింగ్స్ తో నిరుత్సాహ పరిచాయి. డార్లింగ్ కి ఉన్న స్టార్ డమ్ కి రీ-రిలీజులకు వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
'బాహుబలి' ప్రాంచైజీకి ముందు ప్రభాస్ కెరీర్ లో కల్ట్ సినిమాలు లేకపోవడం.. ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. నిజానికి అప్పట్లో 'ఛత్రపతి' తప్ప పెద్దగా మాస్ ని ఆకట్టుకున్న ఇతర సినిమాలేవీ లేవు. ప్రభాస్ రీ-రిలీజ్ లకు ఇలాంటి స్పందన రావడానికి ప్లానింగ్ సరిగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పబడింది. 'రెబల్' 'బిల్లా' వంటి డిజాస్టర్ చిత్రాలను మళ్ళీ విడుదల చేయడంతో.. అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ చిత్రాలకు సానుకూల స్పందన రావడానికి ప్రధాన కారణం.. అవన్నీ వారి కెరీర్ లో చిరస్మరణీయ చిత్రాలు కావడమే అని తెలుస్తోంది. ఆ సినిమాలను టీవీల్లోనో, మొబైల్స్ లోనో చూసే ఈ తరం ప్రేక్షకులు.. ఇప్పుడు థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ ఇక్కడ ప్రభాస్ రీరిలీజుల విషయంలో అన్నీ భిన్నంగా జరిగాయి.
'బాహుబలి' సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకూ టాలీవుడ్ స్టార్ గా ఉన్న డార్లింగ్.. పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'సాహో' మరియు 'రాధేశ్యామ్' సినిమాకు తీవ్రంగా నిరాశ పరిచాయి. కంటెంట్ నచ్చకపోవడంతో ప్రేక్షకులు వాటిని తిరస్కరించారు. ఇప్పుడు రీ-రిలీజుల్లోనూ ప్లాప్ చిత్రాలను ప్రదర్శించడం వల్ల రెస్పాన్స్ పెద్దగా లేదనేది స్పష్టమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.