Begin typing your search above and press return to search.

టిక్ టాక్ ప‌బ్లిసిటీ ఆమాత్రం లాజిక్ తెలీదా?

By:  Tupaki Desk   |   2 Dec 2019 6:37 AM GMT
టిక్ టాక్ ప‌బ్లిసిటీ ఆమాత్రం లాజిక్ తెలీదా?
X
సినిమా ప్ర‌చార శైలి మారింది. ఒక‌ప్పుడు సినిమాల‌ ప్ర‌చారం అంటే ప‌త్రిక‌లు- టీవీ చానెళ్లు- మ్యాగ‌జైన్లు అందుబాటులో ఉండేవి. ఆ ప‌బ్లిసిటీ సాంప్ర‌దాయం వేరు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేరుగా ఎవ‌రి సినిమా వారే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫేస్ బుక్- ట్విట‌ర్- ఇన్ స్టా- వాట్సాఫ్ అంటూ ర‌క‌ర‌కాల ఫీచ‌ర్లు ఉచితంగా అందుబాటులోకి వ‌చ్చేసాయి. వీటికి తోడు టిక్ టాక్ అంటూ వీడియో మాధ్య‌మం అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో సినిమా ప్ర‌చారం సుల‌భ‌త‌ర‌మైంది. వీటి ద్వారా కొంత వ‌ర‌కూ సినిమా ప్రేక్ష‌కుల్లోకి వెళ్తొంది అన్న మాట వాస్త‌వం. కానీ అదే స‌ర్వ‌స్వం అనుకుని మాయ‌లో ప‌డిపోతేనే ఎదుర‌వుతోంది చిక్కు.

కేవ‌లం సోష‌ల్ మీడియాల్ని టిక్ టాక్ అని అనుస‌రించి ఎస‌రు తెచ్చుకుంటున్న నిర్మాత‌ల‌కు కొద‌వేమీ లేదు టాలీవుడ్ లో. చాలా వ‌ర‌కూ ప్ర‌మాణిక‌త ఉన్న‌ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు పాత సంప్ర‌దాయ‌న్ని మాత్రం వ‌ద‌ల్లేదు. అవ‌స‌రం మేర అధికారిక‌ మీడియాని త‌ప్ప‌క ఆహ్వానిస్తున్నారు. ప‌త్రిక‌లు- టీవీ -వెబ్ మాధ్య‌మాల్ని ఆహ్వానిస్తున్నారు. ప్ర‌మోష‌న్ లో వీరి ప్రాధాన్య‌త‌ను విస్మ‌రించ‌లేదు.

అయితే కొంద‌రు మాత్రం సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ లో భాగంగా టిక్ టాక్ యాప్ ప్ర‌చారాన్ని న‌మ్ముకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. టిక్ టాక్ ని క్రేజీగా భావించి కొన్నిటిని విస్మ‌రిస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించి టిక్ టాక్ ఇన్ ప్లూయ‌ర్స్ కొత్త ర‌కం బిజినెస్ కి తెర లేపిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల నుంచి సినిమా ప్ర‌మోష‌న్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారుట‌. సినిమాని త‌మ‌క‌న్నా ఇంకెవ‌రూ స‌రిగా ప్ర‌మోట్ చేయ‌లేర‌ని గొప్ప‌లు చెబుతూ నిలువు దోపిడీ చేస్తున్నార‌ట‌. ఇదంతా ప్ర‌చారంలో ఓ భాగం అనుకున్నా? టిక్ టాక్ ద్వారా సినిమా ఎంత వ‌ర‌కూ రీచ్ అవుతుందన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నే.

ప్ర‌స్తుతం మెయిన్ స్ట్రీమ్ ప‌బ్లిసిటీ అంతా ప‌త్రిక‌లు- ఛానెళ్లు- ప్ర‌మాణిక‌త ఉన్న‌ వెబ్ సైట్ల ద్వారానే జ‌రుగుతోంది. అయితే కొంద‌రు టిక్ టాక్ లాంటి వాటిని న‌మ్మి దెబ్బ‌తింటున్నార‌ని తెలుస్తోంది. అక్క‌డ‌ ఏదో అయిపోతుంద‌న్న క‌న్ఫ్యూజ‌న్ తో ముందుగా డిజిట‌ల్ మీడియా ముందుకెళ్తున్నారు. తీరా త‌మ సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ అయ్యే స‌రికి ఓపెనింగులు లేవు.. బ‌జ్ లేదు.. క‌్రేజ్ లేదు.. అంటూ ల‌బోదిబో మంటున్నారుట‌. ఈ యంగ్ హీరోలు ఇక్క‌డో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నిజంగా టిక్ టాక్ కే అంత సీన్ ఉంటే స్టార్ హీరోలు కూడా ఇప్ప‌టికే టిక్ టాక్ ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసేవారు క‌దా! మ‌రి వాళ్లంతా ఎందుకు టిక్ టాక్ పై అశ్ర‌ద్ద చూపుతున్నారు? సోష‌ల్ మీడియాల ప‌రిధి కొంత‌వ‌ర‌కే. మ‌రి ఈ లాజిక్ ని చిన్న హీరోలు ఎప్పుడు తెలుసుకుంటారో?