Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు అగ్ర హీరోల‌ని ప‌రిశ్ర‌మ అవ‌మానిస్తోందా?

By:  Tupaki Desk   |   10 Dec 2022 6:12 AM GMT
ఇద్ద‌రు అగ్ర హీరోల‌ని ప‌రిశ్ర‌మ అవ‌మానిస్తోందా?
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఇద్ద‌రు సీనియ‌ర్ అగ్ర‌హీరోల‌ని కావాల‌నే అవ‌మానిస్తోందా? అంటే అవున‌ని అంటున్నారు నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి. క‌ల్యాణ్‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' చిత్రాలు రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల‌కు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ధానంగా థియేట‌ర్లు ద‌క్క‌డం లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

దీనిపై తాజాగా నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి. క‌ల్యాణ్ ఘాటుగా స్పందించారు. సంక్రాంతి బ‌రిలో దిగుతున్న సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ చిత్రాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌క‌పోవ‌డం సోచ‌నీయ‌మ‌ని సి. క‌ల్యాణ్ అవేద‌న వ్య‌క్తం చేశారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంతో మేలు చేస్తున్న ఇద్ద‌రు సీనియ‌ర్ అగ్రహీరోల‌ని తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అవ‌మానించ‌డ‌మే న‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యంపై నిర్మాత దిల్ రాజు వెంట‌నే స్పందించాల‌న్నారు.

పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే నిబంధ‌న‌కు క‌ట్టుబ‌డి వుండాల‌ని ఈ సంద‌ర్భంగా సి. క‌ల్యాణ్ గుర్తు చేశారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండ‌గ‌ల స‌మ‌యంలో తెలుగు సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, అనువాద సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌కాద‌నే నిర్ణాయాన్ని గ‌తంలో తీసుకున్నామ‌న్నారు.

ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ 'తెలుగు నిర్మాత‌ల మండ‌లి ఎగ్జిబిట‌ర్ల‌కు ఈ విష‌యంలో విజ్ఞ‌ప్తి చేసింది. ఈ విష‌యం ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌న్నారు.

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' చిత్రాలతో పాటు దిల్ రాజు త‌మిళంలో నిర్మిస్తున్న 'వారీసు' తెలుగులో 'వార‌సుడు'గా రిలీజ్ అవుతోంది. అయితే దిల్ రాజు తాను నిర్మిస్తున్న‌'వార‌సుడు' సినిమాకే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక ధియేట‌ర్ల‌ని కేటాయిస్తున్నాడ‌ని వాద‌న బ‌య‌టికి రావ‌డంతో తెలుగు నిర్మాత‌ల్లో భ‌యాందోళ‌న మొద‌లైందన్నారు.

త‌మిళ‌, క‌న్న‌డ ఇండ‌స్ట్రీల్లో ముందు వాళ్ల సినిమాల‌కే తొలి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ప్పుడు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ తెలుగు సినిమాల‌కే ప్రాధాన్య‌త ఇవ్వాలి' అన్నారు సి. క‌ల్యాణ్‌. ఇటీవ‌ల నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న పై త‌మిళ నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి ఏ స్థాయి ర‌చ్చ చేశారో.. ఏ మేర‌కు బెదిరింపుల‌కు దిగారో తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.