Begin typing your search above and press return to search.

జ‌య‌ల‌లిత స్ఫూర్తితో త్రిష రాజ‌కీయాలు నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   20 Aug 2022 7:46 AM GMT
జ‌య‌ల‌లిత స్ఫూర్తితో త్రిష రాజ‌కీయాలు నిజ‌మేనా?
X
చెన్నై సోయ‌గం త్రిష కెరీర్ లో కొత్త ట‌ర్న్ తీసుకుంటుందా? అమ్మ‌డి మ‌న‌సు రాజ‌కీయాల్ని కోరుకుంటుందా? ప్యాక‌ప్ చెప్ప‌డానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న బ్యూటీ ప్ర‌జా సేవ‌కు రెడీ అవుతుందా? అంటే అవుననే టాక్ బ‌లంగా వినిపిస్తుంది. త్రిష కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది.

తెలుగు..త‌మిళ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించింది. నేటి జ‌న‌రేష‌న్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ స‌త్తా చాటుతుంది. అలాగే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ త‌న‌దైన మార్క్ వేయాల‌ని చూసింది. కానీ అక్క‌డంత స‌క్సెస్ రేట్ రాలేదు. ఉమెన్ సెంట్రిక్ పాత్ర‌ల్లో త్రిష ఇమ‌డ‌లేక‌పోయింది. అలాగ‌ని న‌టిగా అవ‌కాశాలు త‌గ్గాయ‌ని కాదు.

ఇప్ప‌టికీ కోలీవుడ్ లో బిజీ న‌టిగానే కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియ‌న్ సెల్వ‌న్' లోనూ న‌టిస్తోంది. ఇలా న‌టిగా తాను సాధించాల‌నుకున్న‌ది దాదాపు సాధించేసింద‌ని చెప్పొచ్చు. అందుకే త్రిష మ‌న‌సు ఇప్పుడు రాజ‌కీయాల్ని కోరుకున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం త‌మిళనాడులో లీడింగ్ లో ఉన్న పార్టీల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డి పొలిటిక‌ల్ ఎంట్రీపై నెట్టింట పెద్ద ప్ర‌చార‌మే సాగుతోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌..ఎంజీ రామ‌చంద్ర‌న్ స్ఫూర్తితో త్రిష ఎంట్రీ ఇస్తుంద‌ని నెట్టింట ప్ర‌చారం సాగుతోంది.

ప్రాంతీయ పార్టీలు క‌న్నా జాతీయ పార్టీలో భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని..ముందు ఆలోచ‌న‌గా కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డ‌మే మేలుగా భావిస్తుందిట‌. మ‌రి ఇందులో వాస్తవాలు ఏంటి? అన్న‌ది తెలియాలి. సెల‌బ్రిటీల‌లో తమిళనాడు నుంచి జయలలిత తర్వాత పెద్ద‌గా రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవ్వ‌లేదు. ముఖ్య‌మంత్రిగా జ‌య‌ల‌లిత‌ది ఎంతో సుదీర్ఘ ప్ర‌స్తానం.

విజ‌య్ కాంత్.. ఖుష్బు వంటి వారు రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్నా? జ‌య‌ల‌లిత హైట్స్ ని ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ అందుకోలేక‌పోయారు. ఎమ్మెల్యే..మంత్రి..ఎంపీ ప‌ద‌వుల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఖుష్బు బీజేపీలో కొన‌సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ఇక ర‌జ‌నీకాంత్ కొత్త‌గా రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయాల‌ని భావించి చివ‌రి నిమిషంలో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క వెన‌క్కి త‌గ్గారు. అలాగే క‌మ‌ల్ హాస‌న్ 'మ‌క్క‌ల్ నీది మ‌య్యం' అనే పొలిటిక‌ల్ పార్టీని ప్రారంభించారు. కానీ ఇదంత యాక్టివ్ గా కొన‌సాగలేదు. పేరుకు పార్టీలా ఉంది త‌ప్ప పొలిటిక‌ల్ యాక్టివిటీస్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మ‌రోవైపు క‌మ‌ల్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.