Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ మళ్లీ అదే ఫార్ములా వాడేస్తున్నాడా?
By: Tupaki Desk | 30 Aug 2022 7:34 AM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో అతడు, ఖలేజా వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు రూపొందాయి. ఈ రెండు సినిమాల్లో 'అతడు' కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవగా, 'ఖలేజా' కూడా ఇదే తరహాలో ఫ్లాప్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాల అనంతరం దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు.
SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు రెండు నెలల క్రితమే లాంఛనంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సెట్స్ పైకి ఇంకా వెళ్లని ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం మేకర్స్ ప్రకటించేశారు. 2023 ఏప్రిల్ 28న సమ్మర్ బరిలో దించేస్తున్నామంటూ రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ 8 నుంచి హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నారని తెలిసింది.
అయితే ఇందు కోసం 'అరవింద సమేత' ఫార్ములాని వాడుతున్నాడట త్రివిక్రమ్. ఈ మూవీని ఫైట్ సీక్వెన్స్ తో ప్రారంభించిన విషయం తెలిసిందే.
SSMB28ని కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించాలని ప్లాన్ చేశాడట. ఇందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నేతృత్వంలో భారీ సెట్ ని నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ భారీ సెట్ లో మహేష్, కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా 'కేజీఎఫ్' ఫైట్ మాస్టర్స్ అన్బు - అరివుల నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రారంభ సన్నివేశంగా షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' రెగ్యులర్ షూట్ ని కూడా ఇదే తరహాలో ఫస్ట్ డే యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించడం విశేషం.
ఫైట్ సీక్వెన్స్ షెడ్యూల్ పూర్తయ్యాక టీమ్ అంతా కామెడీ పార్ట్ ని పూర్తి చేసే పనిలో వుంటారట. ఈ మూవీలోని కీలక పాత్రలో మాజీ లవర్ బాయ్ తరుణ్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిక ఇసంబంధించిన అధికారిక ప్రకటన సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.