Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' ఆ రెండింటిని మించి ఉండబోతుందా..??

By:  Tupaki Desk   |   6 April 2021 3:42 PM IST
టక్ జగదీష్ ఆ రెండింటిని మించి ఉండబోతుందా..??
X
నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన సినిమా టక్ జగదీష్. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు ముస్తాబు అవుతోంది. టక్ జగదీష్ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటినుండి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే సినిమా పాటలు, టీజర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. సినిమా ఏప్రిల్ 23న ఉగాది కానుకగా విడుదల కాబోతుంది. ప్రేక్షకులు కూడా సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా టక్ జగదీష్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ ఇదివరకు తెరకెక్కించిన రెండు సినిమాలు నిన్నుకోరి, మజిలీ చాలా ఎమోషనల్ టచ్ తో రూపొందాయి.

మరి టక్ జగదీష్ సినిమా లుక్స్ చూస్తే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే.. టక్ జగదీష్ సినిమా నిన్నుకోరి, మజిలీ సినిమాలను మించిన భావోద్వేగాలతో నిండి ఉంటుందని సమాచారం. కాకపోతే ఈసారి కమర్షియల్ హంగులతో పాటు ఎమోషన్స్ కూడా సమపాళ్ళలో కవర్ చేసాడట డైరెక్టర్. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో హీరో నాని, జగపతిబాబులు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని చిత్రయూనిట్ చెబుతోంది. చూడాలి మరి శివ ఈసారి ఎలాంటి ఎమోషన్స్ తో కనెక్ట్ చేస్తాడో. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నాని సరసన రితూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.