Begin typing your search above and press return to search.
బిబి4 : నేడు టీవీ9 దేవి కూడానా?
By: Tupaki Desk | 27 Sep 2020 8:10 AM GMTఈవారం బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంటి సభ్యులు అంతా కూడా ఖచ్చితంగా కుమార్ సాయి వెళ్లిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక వర్గం వారు ఆయన ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్ గా అనుకుంటున్నారు. అయితే నిన్నటి లీక్ ప్రకారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. స్టార్ మా వారి నుండి తప్పుడు లీక్ వచ్చిందని ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబ్ కాదు టీవీ9 దేవి అంటూ కొత్త ప్రచారం ఒకటి మొదలు అయ్యింది.
సోషల్ మీడియాలో ఎలిమినేషన్ కు సంబంధించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. షో పై ఆసక్తి కలిగించేందుకు ఎలిమినేషన్ విషయంలో కావాలని నిర్వాహకులు తప్పుడు లీక్ లు ఇస్తున్నారు అనేది కూడా కొందరి అనుమానం. మొత్తానికి ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అనే విషయంలో మాత్రం లీక్ లు వస్తున్నా కూడా క్లారిటీ మాత్రం లేదు. గత వారం అంతకు ముందు వారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్లుగా సూర్య కిరణ్ మరియు కరాటే కళ్యాణిలు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. కాని ఈ వారంలో మాత్రం కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు విషయం ఏంటీ అనేది నేటి ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.