Begin typing your search above and press return to search.
వీరయ్య కోసం ఊరమాస్ వరలక్ష్మిని దించుతున్నారా?
By: Tupaki Desk | 23 July 2022 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అభిమానులు మెచ్చే చిత్రంగా పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దుతున్నారు. వాల్తేరు వీరయ్య పాత్రలో మెగాస్టార్ ఊర మాస్ గా కనిపించనున్నారు. కథ మొత్తం వైజాగ్ వాల్తేర్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతోంది. దీనిలో భాగంగా ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లోనే ప్లాన్ చేసారు.
అవసరమైన సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో సెట్లు నిర్మించి చేస్తున్నారు. ఇక వీరయ్య గా మెగాస్టార్ మాస్ అప్పీరియన్స్ పీక్స్ లో ఉంటుందని డైరెక్టర్ మాటల్లోనే తెలుస్తోంది. మెగాస్టార్ ని ఎంతో అభిమానించి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. అతని పై అభిమానమంతా సినిమాలో కనిపిస్తుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసారు.
దీన్ని బట్టి మెగాస్టార్ చాలా కాలం తర్వాత ఊర మాస్ లుక్ లో అభిమానులు ఊహించుకుంటున్నారు. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.
అప్డేడెట్ కథతోనే చిరుని పతాక స్థాయిలో ఎలివేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఊర మాస్ పాత్రకి ధీటుగా ఓలేడీ విలన్ ని సైతం దించుతున్నాడుట బాబి.
ఆమె ఎవరో కాదు ఊర మాస్ లేడీ విలన్ పాత్రల్లో దూసుకుపోతున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తో ఈ పాత్రకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఊర మాస్ పాత్రలో వరలక్ష్మి ఒదిగిపోతుందని చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పాత్రలు చేయడం వరలక్ష్మికి కొట్టిన పిండి. వరలక్ష్మి ఆ తరహా పాత్రలతోనే తమిళ్..తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకుంది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పరిశ్రమ వరలక్ష్మిని విలనీగానే ఓన్ చేసుకుంది. నాటి నుంచి అదే తరహా పాత్రల వైపు మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా వరలక్ష్మి విలనీ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దునియా విజయ్..లాల్ పాల్ కీలకమైన విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ బాలయ్య కి ధీటుగానే వరలక్ష్మీ పాత్ర కూడా ఉంటుందని సమాచారం. బాలయ్య ఎనర్జీని..వేగాన్ని మ్యాచ్ చేసేలానే వరం పాత్ర ఉంటుందని అంటున్నారు. మరి చిరంజీవి సినిమాలో కూడా నిజంగా ఆఫర్ వరిస్తే వరలక్ష్మి రేంజ్ మారిపోవడం లాంఛనమే.