Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు పోరాటం క్లైమాక్స్ కి చేరిన‌ట్లేనా?

By:  Tupaki Desk   |   11 Oct 2022 10:30 AM GMT
వీర‌మ‌ల్లు పోరాటం క్లైమాక్స్ కి చేరిన‌ట్లేనా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. అనంత‌రం యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో ్యా బిజీ అవ్వ‌డంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఈ నేప‌థ్యంలో క్రిష్ త‌దుప‌రి షెడ్యూల్స్ కి సంబంధించి ప్ర‌ణాళిక వేసుకోవ‌డం.. అవ‌స‌ర‌మైన వ‌ర్క్ షాపులు వంటివి నిర్వ‌హించారు.

ఇటీవ‌లే ఈ వ‌ర్క్ షాప్ లో ప‌వ‌న్ కూడా పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌దుప‌రి షెడ్యూల్ కూడా సోమ‌వారం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. పీకే పై పోరాట ఘ‌ట్టాల‌కు సంబంధించి ఓస్టూడియోలో జ‌రిగిన సాధన శిబిరానికి హాజ‌ర‌య్యారు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీల‌క మైన పోరాట స‌న్నివేశాల్ని చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో దాదాపు షూట్ కి సంబంధించి కీల‌కమైన పార్ట్ పూర్త‌వుతుద‌ని స‌మాచారం. ముఖ్యంగా పీకే పై ప్ర‌ధాన ఘట్టాల‌కు సంబంధించిన ఆయ‌న పాత్ర పై షూట్ క్లైమాక్స్ కి చేరుకున్న‌ట్లేన‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ప‌వ‌న్ పూర్తి స్థాయిలో రాజ‌కీయ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లు కానున్నారు .

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ని వీలైనంత త్వ‌ర‌గా షూట్ నుంచి బ‌య‌టకు పంపేసే ప్ర‌క్రియ‌లో భాగంగానే క్రిష్ అత‌నిపైనే ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అటుపై బ్యాలెన్స్ స‌హా ప్యాచ్ వ‌ర్క్ ఉంటే కూల్ గా చేసే యోచ‌న‌లో ఉన్నారు. ఇక సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ప‌వ‌న్ తొలిసారి సోషియా ఫాంట‌సీ చిత్రంలో న‌టిస్తున్నారు.

ఇందులో ప‌వ‌న్ బందిపోటు పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్ ఇప్ప‌టికే అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారింది. ప‌వ‌న్ ఆహార్యం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఇందులో పీకికే జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

కీర‌వాణీ సంగీతం అందిస్తోన్న చిత్రాన్ని ఏఎం ర‌త్నం..ఏ. దయాక‌రరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది మార్చిలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.