Begin typing your search above and press return to search.

హిట్ 4 కి ముందే వెంకీ మామ వ‌చ్చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   27 Dec 2022 6:34 AM GMT
హిట్ 4 కి ముందే వెంకీ మామ వ‌చ్చేస్తున్నాడా?
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ 'హిట్ ది ఫ‌స్ట్ కేస్‌'. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన ఈ మూవీ సంచ‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్స్ ని చేయ‌డం మొద‌లు పెట్టారు. హిట్ యూనివ‌ర్స్ నేప‌థ్యంలో డిఫ‌రెంట్ డ‌ఫ‌రెంట్ స్టోరీస్ తో డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ హీరోస్ తో ఈ 'హిట్‌' యూనివ‌ర్స్ కి సంబంధించిన సీక్వెల్స్ తెర‌పైకి వ‌స్తూనే వుంటాయి. ఈ ఫార్ములాని కొన‌సాగిస్తున్న రీసెంట్ గా మ‌రో హిట్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

వ‌రుస‌గా విభిన్నమైన సినిమాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్న అడివి శేష్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'హిట్ ది సెకండ్ కేస్‌'. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ కూడా హిట్ కి మించి విజ‌యాన్ని సాధించి నిర్మాత‌గా హీరో నానికి మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.

దీనికి కొన‌సాగింపుగా త్వ‌ర‌లో 'హిట్ 3'ని చేయ‌బోతున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీ ఎండింగ్ లో అర్జున్ స‌ర్కార్ పాత్ర‌లో రూత్ లెస్ పోలీస్ ఆఫీస‌ర్ గా హీరో నాని ఎంట్రీ ఇచ్చాడు.

'హిట్ 2' కి సీక్వెల్ గా హిట్ 3 ని హీరో నాని తో చేయ‌బోతున్నారు. ఆ కార‌ణంగానే ఈ మూవీ ఎండింగ్ లో అర్జున్ స‌ర్కార్ క్యారెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ పార్ట్ 2 కు ఎండ్ కార్డ్ వేశారు. వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ నేఫ‌థ్యంలో హిట్ 3 ఎండింగ్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని, హిట్ 4 ని వెంక‌టేష్ పై ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో వ‌చ్చిన 'ఘ‌ర్ష‌ణ‌' మూవీలో విక్ట‌రీ వెంట‌కేష్‌ డీసీపీ రామ‌చంద్ర అనే ప‌వ‌ర్ ఫుల్ కాప్ గా క‌నిపించి అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను రీసెంట్ గా విక్టీరఈ వెంక‌టేష్ కు 'హిట్ 4' సీక్వెల్ స్టోరీని వినిపించాడ‌ని, దీనికి వెంక‌టేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే వెంక‌టేష్ 'హిట్ 3' ఎండింగ్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇది నిజంగా వెంకీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.