Begin typing your search above and press return to search.
వెటరన్ స్టార్ కృష్ణం రాజుకు అస్వస్థత?
By: Tupaki Desk | 10 Sep 2022 3:42 PM GMTరెబల్ స్టార్ కృష్ణం రాజు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆస్పత్రి నుంచి తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో అంతర్జాలంలో వైరల్ అయ్యింది.
కృష్ణం రాజుకు ఆరోగ్య పరంగా ప్రమాదం ఏమీ లేదు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారని కూడా టాక్ వినిపిస్తోంది. పెద్దాయన ప్రస్తుతం ఏజ్ సంబంధమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల నటనను కూడా విరమించారు. ఇటీవలే రాధేశ్యామ్ లో ఓ పాత్రలో నటించిన కృష్ణంరాజు చాలా రేర్ గా మాత్రమే నటించేందుకు అంగీకరిస్తున్నారు.
కోవిడ్ సమయంలో ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగింది. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతోనే చికిత్స అందిస్తున్నారని తెలిసింది. అయితే అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పెదనాన్న ఆరోగ్యంపై నిరంతరం ఆరాలు తీస్తున్న ప్రభాస్ అతడి స్నేహితుల బృందం అనుక్షణం తనని కనిపెట్టుకుని ఉంటున్నారని కూడా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.