Begin typing your search above and press return to search.
విజయ్ 'బీస్ట్' ఆ హాలీవుడ్ మూవీకి కాపీనా?
By: Tupaki Desk | 4 April 2022 5:22 AM GMTసమ్మర్ చిత్రాల సందడి మొదలైంది. మరో పది రోజుల్లో ఈ హంగామా మరింత ఊపందుకోబోతోంది. తెలుగులో ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. అయితే సమ్మర్ హంగామా మాత్రం విజయ్ `బీస్ట్`, యష్ కేజీఎఫ్ లతో ప్రారంభం కాబోతోంది. మరో 9 రోజుల్లో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `బీస్ట్` రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని విజయ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇటవల `మాస్టర్` రెండు భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ చిత్రాన్ని కూడా రెండు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కొలమావు కోకిట, డాక్టర్ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్థకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఏప్రిల్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
పూజా హోగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ ఈ మూవీపై ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ స్టోరీని 2009లో వచ్చి హాలీవుడ్ `పాల్ బ్లార్ట్ : మాల్ కాప్` సినిమా నుంచి స్ఫూర్తి పొందారని వార్తలు వినిపిస్తున్నాయి.
అనుమానాలకు తగ్గట్టే `బీస్ట్`కు హాలీవుడ్ `పాల్ బ్లార్ట్ : మాల్ కాప్` సినిమా దగ్గరి పోలికలు వుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇందులో ఓ మాల్ ని నేరస్తుల ముఠా స్వాధీనం చేసుకుంటుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ మాల్ లో చిక్కుకున్న ప్రజలని రక్షించడానికి నేరస్తులతో పోరాడి చివరికి వారిని రక్షిస్తాడు.
`బీస్ట్` కూడా సేమ్ టు సేమ్ ఇదే తరహా కథతో సాగుతుందని తెలుస్తోంది. విజయ్ మాల్ లో ఇరుక్కున్న ఓ సైనికుడిగా కనిపిస్తాడట. మాల్ ని తన ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదుల్ని సైనికుడైన విజయ్ ఎలా వారిని అంతం చేశాడు? .. ఆ మాల్ లో వున్న ప్రజల్ని ఎలా రక్షించాడన్నది `బీస్ట్` కథగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. అమ్మ నెల్సన్ అక్కడి నుంచి బీస్ట్ ని లేపేశావా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై దర్శకుడు నెల్సన్ దిలీప్ కానీ, మేకర్స్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, ది. సురేష్ బాబు, ఏషీయన్ సునీల్ సంయుక్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో రీసెంట్ గా విజయ్ నటించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు బిగ్ ప్రొడ్యూసర్స్ `బీస్ట్ `ని రిలీజ్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.