Begin typing your search above and press return to search.
'మాస్టర్' విషయంలో విజయ్ అసంతృప్తి చెందుతున్నారా..?
By: Tupaki Desk | 1 Feb 2021 11:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో 'ఇళయ దళపతి' విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ సేతుపతి కలిసి నటించిన 'మాస్టర్' సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్ళు రాబట్టింది. కోవిడ్ నిబంధనలతో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తొలి రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 'మాస్టర్' రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విడుదలైన కేవలం 16 రోజుల్లోనే అంటే జనవరి 29న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ నిర్ణయం పట్ల విజయ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.
నిజానికి 'మాస్టర్' సినిమా మూడో వారంలో మంచి కలెక్షన్లు రాబడుతున్న సమయంలో ఓటీటీలో విడుదల చేయడాన్ని థియేటర్ యాజమాన్య సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే అంశంపై థియేటర్ యాజమాన్యం ఇటీవల సమావేశమై థియేటర్లలో ప్రదర్శించినందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని మొదటి వారం నుంచే చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. మంచి కలెక్షన్లు వస్తున్నప్పటికీ 'మాస్టర్' చిత్రాన్ని మూడో వారంలోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడం పట్ల విజయ్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది.