Begin typing your search above and press return to search.
అమ్మాయి దెబ్బకు రౌడీ అలర్ట్?
By: Tupaki Desk | 17 Sep 2022 6:02 AM GMTటాలీవుడ్ లో టాలెంట్ కే పెద్ద పీట అని చెబుతుంటారు కానీ అది పచ్చి అబద్ధం అని చాలా సార్లు నిరూపణ అయింది. టాలెంట్ కంటే ఇక్కడ సక్సెస్ కే విలువ ఎక్కువ. దాని మీదే ఇండస్ట్రీ ప్రధానంగా అడుగులు వేస్తూ వుంటుంది. ఒక్కసారి అది పట్టు తప్పిందా?.. ఫ్లాపుల్లోకి ఎంటరైన వారిని ఇక్కడ పట్టించుకోవడం కష్టం.. ముందు అనుకున్నా.. ఆ తరువాత ఫ్లాప్ పడితే.. అలాంటి వారు వస్తున్నారంటే కిలోమీటర్ దూరం పారిపోతుంటారిక్కడ.
తాజాగా ఇదే పరిస్థితి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ఎదురవుతున్నట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..సెన్సిబుల్ సినిమాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ గత కొంత కాలంగా తన మార్కు హిట్ లని సొంతం చేసుకోలేకపోతున్నాడు. 'సమ్మోహనమ్' తరువాత ఆ స్థాయికి మించి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇంద్రగంటికి చేదు అనుభవమే ఎదురవుతూ వస్తోంది. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబుల కలయికలో ఇంద్రగంటి చేసిన రివేంజ్ డ్రామా 'వి' అతని కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది.
రెండేళ్ల విరామం తీసుకుని చేసిన లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. స్టార్ కావాలనుకున్న ఓ డాక్టర్.. తనని స్టార్ ని చేయాలనుకున్న ఓ మేకర్ నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు.
శుక్రవారం విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ని సొంత చేసుకుని షాకిచ్చింది. దీంతో ఈ మూవీ తరువాత ఇంద్రగంటి చేయాలనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ లు డైలమాలో పడ్డాయి. 'లైగర్'తో రీసెంట్ గా డిజాస్టర్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ .. ఇంద్రగంటి మోహన కృష్ణతో ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు.
గతంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ కమిట్ అయ్యారు. తన కోసం ఇప్పటికే దిల్ రాజు చాలా మంది దర్శకుల వద్ద కథలు విన్నారు. ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయించారు. అయితే అందులో ఏ కథ నచ్చలేదు. ఫైనల్ గా ఇంద్రగంటి మోహనకృష్ణతో విజయ్ దేవరకొండ హీరోగా ఓ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఫలితం తరువాత దీనిపై ఆలోచించాలనుకున్నారు.
కానీ అనూహ్యంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఫ్లాప్ కావడంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 'లైగర్'తో భారీ డిజాస్టర్ ని చూసిన విజయ్ దేవరకొండ .. ఫ్లాప్ ఇచ్చిన ఇంద్రగంటితో సాహసం చేయడం కష్టమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో మరో దర్శకుడితో వెళ్లే అవకాశం వుందని కూడా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.