Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' ఆమె జీవిత కథేనా?
By: Tupaki Desk | 2 Jun 2022 11:32 AM GMTరానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర కెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. గత ఏడాది కాలంగా ఈమూవీ రిలీజ్ అదిగో ఇదుగో అంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఓటీటీలో రిలీజ్ అవుతుందని కొంత మంది లేదు లేదు సినిమా రిలీజ్ కావడం కష్టమేనని మరి కొంత మంది ప్రచారం చేశారు.
ఫైనల్ గా పుకార్లకు చెక్ పెడుతూ మేకర్స్ ఫైనల్ గా జూలై 1న మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే దాదాపు సినిమా రిలీజ్ కి రెండు నెలలు సమయం వుండటంతో ఇంత సమయం అవసరమా అనే కామెంట్ లు వినిపించాయి.
ఇప్పటికే ఆలస్యమౌతూ వచ్చిన ఈ మూవీ రిలీజ్ కోసం మరో 50 రోజులకు పైనే ఎదురుచూడాలా? అంటూ అభిమానులు మేకర్స్ పై కామెంట్ లు చేశారు. దీంతో ఫైనల్ గా ఈ మూవీని జూన్ 17కు మార్చేసింది చిత్ర బృందం. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఉత్తర తెలంగాణలో 1990వ దశకంలో నక్సల్స్ ఉద్యమం సంచలనం సృష్టించింది. ఆ టైమ్ లో భువనగిరిలో జరిగిన బెల్లి లలిత హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నక్సలైట్ ఉత్యమంలో చురుగ్గా వున్న బెల్లి లలిత విప్లవ గీతాలని ఊరూరా ఆలపిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. అయితే అలాంటి జానపద గాయనిని మాజీ నక్సలైట్ నయీం ముఠా అత్యంత దారుణంగా హత్య చేసింది.
ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కో పీస్ ని ఒక్కో ఏరియాలో పడేసి సంచలనం సృష్టించింది. అంతే ఆకకుండా ఈ హత్య 1999లో సంచలనం గా మారింది. చౌటుప్పల్ లోని పోలీస్టేషన్ ముందే బెల్లి లలితను నయీం ముఠా అతి దారుణంగా నరికి చంపింది. అదే పాత్ర స్ఫూర్తితో `విరాటపర్వం`లోని సాయి పల్లవి పాత్రని డిజైన్ చేశారని, పక్కాగా చెప్పాలంటే ఈ మూవీ బెలకలిలలిత బయోపిక్ అని ప్రచారం జరుగుతోంది. రానీ నెగెటివ్ పాత్రలో నటించగా ప్రియమణి ఈ మూవీలో సాయి పల్లవిని హత్య చేస్తుందని చెబుతున్నారు.
ఆ కారణంగానే సురేష్ బాబు ఈ మూవీ రిలీజ్ ని ఇంత కాలం ఆపేశారని, చాలా వరకు సన్నివేశాలని రీ షూట్ చేయమన్నారని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.