Begin typing your search above and press return to search.
విశ్వక్ సేన్ ధమ్కీ.. క్లియర్ చేసినట్టేనా?
By: Tupaki Desk | 27 March 2023 7:24 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఆడియన్స్ తో పాటు యూత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్ది మంది నటులలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. విశ్వక్ కు ప్రేక్షకులతో ఒక క్లోజ్ బాండింగ్ ఉంటుంది. విశ్వక్ తాజా చిత్రం దాస్ కా ధమ్కీ ఓపెనింగ్స్ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రం ఉగాది పండుగ రోజున మార్చ్ 22వ తేదీన బుధవారం నాడు విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ దాస్ కా ధమ్కీకి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మొదటి రోజు తర్వాత కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది. యుఎస్‌లో కూడా మొదటి రెండు రోజుల కలెక్షన్లు బాగానే ఉన్నా వీకెండ్ గ్రోత్ ఏమాత్రం లేదు. శుక్ర, శనివారాల కలెక్షన్లు ప్రీమియర్ రోజు వచ్చిన గ్రాస్‌లో 50% కూడా రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో సైతం తొలిరోజు ఆకట్టుకున్న కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది.
ఈ సినిమా విశ్వక్ మొదటి పాన్-ఇండియా సినిమాగా ప్రచారం చేసినా తెలుగు రాష్ట్రాల బయట ఈ సినిమా ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు. విశ్వక్ సేన్ సినిమాని చూడాలని ఉత్సుకతతో ఉన్న ప్రేక్షకులు ఉన్నారు, కానీ రొటీన్ కంటెంట్ ఆయన సినిమాలను పక్కన పెట్టేలా చేస్తోంది.
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు తమ సినిమాల ఓపెనింగ్ రోజున ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడానికి కష్టపడుతున్నారు.
అయితే విశ్వక్ సేన్‌కు ప్రేక్షకులను ఆకర్షించడానికి మంచి ఈజ్ ఉంది కానీ అతని పేలవమైన స్క్రిప్ట్‌లు ఇబ్బంది కరంగా మారుతున్నాయి అని చెప్పక తప్పదు. నిజానికి విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు.
అయితే ఆయన మంచి స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై దృష్టి పెట్టడం మంచిదని ఇప్పుడే సినిమా నిర్మాణం, డైరెక్షన్ మీద ఫోకస్ పెట్టి అదనపు ఒత్తిడి, భారాన్ని తెచ్చుకోకుండా ఉంటే మంచిది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.