Begin typing your search above and press return to search.
`వాల్తేరు వీరయ్య` ఓవర్ బడ్జెట్ మూవీనా?
By: Tupaki Desk | 11 Jan 2023 12:36 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య`. చాలా ఏళ్ల తరువాత మాసీవ్ అవతార్ లో గల్ల లుంగీ ధరించి వింటేజ్ లుక్ లో ఊర మాస్ పాత్రలో రచిరంజీవి నటించిన మూవీ ఇది. చిరుకు వీరాభిమాని అయిన బాబి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. చిరుతో కలిసి దాదాపు 22 ఏళ్ల విరామం తరువాత మాస్ మహారాజా కీలక అతిథి పాత్రలో నటించారు.
జనవరి 13న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ట్రైలర్ లో చిరు కోసం ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించినట్టుగా లావిష్ యాక్షన్ ఘట్టాలు.. ఫారిన్ లొకేషన్స్.. విలన్ గ్యాంగ్ ని చూపించిన విధానం స్పష్టం చేసింది. అయితే ఈ మూవీని చిరు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారని, బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది.
అంతే కాకుండా చిరు కెరీర్ లో చేసిన ఓవర్ బడ్జెట్ ఫిల్మ్ ఇదినే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్ లపై మెగాస్టార్ చిరంజీవి బుధవారం స్పందించారు. `వాల్తేరు వీరయ్య` ఓవర్ బడ్జెట్ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. సింగిల్ ఫ్రేమ్ కూడా వేస్ట్ కాలేదని, ప్రతీ సీన్ ఎడిటింగ్ టేబుల్ పైకి వెళ్లిందన్నారు. అయితే సినిమా రన్ టైమ్ మరింత క్రిస్మీగా.. షార్ప్ గా వుండాలనే ఆలోచనతో 5 నిమిషాల నిడివిని కట్ చేశామని తెలిపారు చిరు.
అంతే కాకుండా సినిమాను అనుకున్న ప్రకారం అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశామని, ఎక్కడా బడ్జెట్ పెరగలేదన్నారు చిరు. ఇదిలా వుంటే ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడటంతో నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా భారీ ఆఫర్ లభించిందని, ఈ విషయంలో మేకర్స్ లాభాల్లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటించిన విషయం తెలిసిందే. థియేటర్లలో చిరు, రవితేజ కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.