Begin typing your search above and press return to search.
రజనీకాంత్ రికార్డును యష్ బ్రేక్ చేస్తున్నాడా?
By: Tupaki Desk | 4 March 2021 9:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం హిందీ బాక్సాఫీస్ నుంచి వసూలు చేసినంతగా సౌత్ భాషల్లో వసూలు చేయలేదు. అయినా ఈ సినిమాకి ముందస్తు హైప్ నేపథ్యంలో అన్నిచోట్లా భారీగా బిజినెస్ సాగింది. ముఖ్యంగా డిజిటల్ - ఓటీటీ- శాటిలైట్- మ్యూజిక్ రైట్స్ ఇలా అన్నిటినీ కలుపుకుని దాదాపు 110 కోట్లు నిర్మాతలకు దక్కిందని ప్రచారమైంది.
ఇప్పుడు ఇంచుమించు అదే రేంజులో కేజీఎఫ్ చాప్టర్ 2 నాన్ థియేట్రికలర్ రైట్స్ బిజినెస్ చేస్తోందని సమాచారం. ఓ సోర్స్ ప్రకారం.. థియేట్రికల్ కాకుండా ఇతర హక్కుల కోసం 120 కోట్లు హోంబలే సంస్థ అందుకుంటోందన్న లీక్ అందింది. కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే చాప్టర్ 2 భారీ యాక్షన్ తో డబుల్ ట్రీటివ్వనుంది. పైగా సంజయ్ దత్ లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ విలన్ పాత్ర పోషిస్తుండడంతో అటు హిందీ మార్కెట్లోనూ విపరీతమైన క్రేజు నెలకొంది. దీంతో డిజిటల్ రైట్స్ - శాటిలైట్ హక్కుల రూపంలో అంత పెద్ద మొత్తం ముడుతోందని సమాచారం. 2.0 రికార్డును ఇప్పుడు ఈ మూవీ బ్రేక్ చేసిందంటూ ప్రచారమవుతోంది.
మరోవైపు థియేట్రికల్ రైట్స్ సంబంధించిన బేరసారాలు సాగుతున్నాయిట. నిర్మాతలు భారీ మొత్తాల్ని కోట్ చేస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు ఖంగు తింటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం 90కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న సమాచారం ఉంది. అలాగే కన్నడ -తమిళం - హిందీలో భారీ థియేట్రికల్ బిజినెస్ చేయనుంది. అయితే రేట్ల విషయంలోనూ బయ్యర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
కేజీఎఫ్ 1 డిజిటల్లో గొప్ప ఆదరణ దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. 2.0 కి ధీటుగా డిజిటల్లో కేజీఎఫ్ చాప్టర్ 1 ఆదరణ దక్కించుకుంది. అందుకే ఇప్పుడు పార్ట్ 2కి డిమాండ్ నెలకొందని విశ్లేషిస్తున్నారు.
కేజీఎఫ్ 2 బడ్జెట్ పైనా ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాని కేవలం 100కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాలని తొలుత భావించినా .. 150కోట్లు పైగా వెచ్చించాల్సి వచ్చిందని.. అయితే డిజిటల్ రైట్స్ రూపంలోనే భారీ మొత్తం దక్కడం టీమ్ కి పెద్ద ఊరట అన్న టాక్ కూడా వినిపిస్తోంది. నాన్ థియేట్రికల్ సంతృప్తికరం అన్న టాక్ వచ్చింది కాబట్టి థియేట్రికల్ బిజినెస్ పెద్ద స్థాయిలోనే జరిగే అవకాశం ఉంది. జూలై 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.