Begin typing your search above and press return to search.
అంబానీ కూతురు గ్రహశాంతి పూజ
By: Tupaki Desk | 28 Nov 2018 10:03 AM GMTడబ్బుంటే గ్రహాలే దిగొస్తాయి! డబ్బు వెదజల్లి ఏ గ్రహాన్ని అయినా దారిలో పెట్టవచ్చు. అంతరిక్షంలోని గ్రహాలకు శాంతి పూజలు చేయించొచ్చు. గ్రహదోష నివారణ చేయొచ్చు. అయితే ఈ తరహా పూజల్లోనూ ఎంత చెట్టుకు అంత గాలి! .. డబ్బు కొద్దీ పూజలు. రిచ్.. అల్ట్రా రిచ్.. ఎన్ రిచ్ పూజలు చేయించొచ్చు. కాళ హస్తికి వెళ్లి సామాన్యుడు కాలసర్పదోష పూజ చేయిస్తే రూ.1000-2000 ఖర్చుతో అయిపోతుంది. అదే ఖరీదైన అంబానీలు వెళితే అదే పూజకు రూ.5కోట్లు అయినా ఖర్చవ్వొచ్చు. ఇలాంటి పూజల వేళ వీళ్లు ధరించే ఆభరణాలు - లెహంగాలకు లక్షలు కోట్లు ఖర్చు చేయొచ్చు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అంబానీ కూతురిని చూశారా? మెడనిండా వజ్ర వైఢూర్య శోభిత బంగారు ఆభరణాల్ని ధరించింది. పేరు ఇషా అంబానీ. పిరమాల్ రియాలిటీ గ్రూప్ కి చెందిన బిలియన్ ట్రిలియన్ డాలర్ ఆస్తిమంతుడు అజయ్ పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్ ని ఈ అమ్మడు పెళ్లాడుతోంది. డిసెంబర్ 12న ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇదివరకూ ఇటలీ లోక్ -కోమోలో సరదా సరదాగా కోట్లు వెదజల్లి మూడు రోజుల పాటు కొత్త జంట పెళ్లి గెటప్ షూట్ ని కానిచ్చారు.
తాజాగా ఇషా అంబానీ గ్రహశాంతి పూజకు సంబంధించిన సవ్యసాచి లెహెంగా లుక్ ని సవ్యసాచి అధికారిక ఇన్ స్టాగ్రమ్ లో రివీల్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇషా మెడలో ఆభరణంలో అన్ కట్ సిండికేట్ డైమండ్స్.. జాంబియా ఎమరాల్డ్స్‌ని ఉపయోగించారట. ఇక వేరొక ఫోటోషూట్ లో ఇషా అచ్చం బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనేకి సిస్టర్ లా కనిపిస్తోంది. డబ్బుంటే దీపికకు చెల్లినే కాదు.. ఎలిజబెత్ - జెన్నిఫర్ కి అక్కను కూడా తయారు చేయొచ్చు.. అన్నట్టే ఉందీ లుక్!!