Begin typing your search above and press return to search.
ఇషా-ఆనంద్ వెడ్డింగ్ కార్డ్ వైరల్
By: Tupaki Desk | 6 Nov 2018 12:13 PM ISTభారత దేశంలోనే అత్యంత సంపన్నుడు ఆయన.. అలాంటి ఆయన ఇంట పెళ్లి సందడి అంటే ఆ మాత్రం హంగు ఆర్భాటాలు సహజం.. పైగా ముకేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ పెళ్లి మరీ.. అందుకే రాజుల కాలం నాటి సంప్రదాయాలతో అత్యంత అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అత్యంత వైభవంగా నిశ్చిత్తార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా పెళ్లి వేడుక కోసం శుభలేఖను తయారు చేశారు. ఈ శుభలేఖకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ముఖేష్ అంబానీ-నీతాల కూతురు ఇషా అంబానీతో త్వరలో పిరామల్ రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు ఆనంద్ పిరామల్ కు పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్ 10న ఇషా-ఆనంద్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి వేడుక కోసం దేశీయ - అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ పెళ్లికి ముందస్తుగా డిసెంబర్ 8 - 9న రెండు రోజుల పాటు సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్నే ప్రదర్శన ఏర్పాటు చేశారట.. ఇందుకు ఆమెకు రూ.15 కోట్ల భారీ పారితోషకం ఏర్పాటు చేసి మరీ రప్పిస్తున్నారట.. ఇటలీలో నిశ్చితార్థం.. ఇండియాలో పెళ్లితో అంబానీ ఇంట పెళ్లి సందడి అప్పుడే వచ్చేసింది.