Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బాడీనే డోంట్ కేర్ అంటే

By:  Tupaki Desk   |   27 Feb 2018 5:17 AM GMT
ఫోటో స్టోరీ: బాడీనే డోంట్ కేర్ అంటే
X
బాలనటిగానే బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముంబై భామ ఇషా తల్వార్ కు.. మలయాళ సినీ పరిశ్రమ బాగానే పట్టం కట్టింది. ఆరేళ్ల క్రితం ఆమెను హీరోయిన్ చేసినది కేరళ ఇండస్ట్రీనే. అయితే.. తెలుగులో కూడా అడపదడపా నటిస్తోంది ఈ బ్యూటీ. గుండె జారి గల్లంతయిందే వంటి హిట్ మూవీలో కనిపించినా.. అంతగా ఛాన్సులు అందలేదు. అలాగని ఈమె కెరీర్ పై అదేమీ ఎఫెక్ట్ చూపలేదు.

ముంబై పోరి కావడంతో ఇషా తల్వార్ లో గ్లామర్ యాంగిల్ చాలానే ఉంది. సినిమాల్లో మనం ఈ కోణాన్ని చూసే అవకాశం ఇంకా రాలేదు కానీ.. సోషల్ మీడియా రూపంలో మాత్రం ఆ తరహా అప్డేడ్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ కేప్ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడి బీచ్ లో సరాగాలు ఆడుతున్న సమయంలో.. ఓ బికినీ లాంటి గెటప్ వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వడమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి.. సూపర్బ్ కొటేషన్ కూడా ఇచ్చేసింది. ఐ డోంట్ కేర్ అని బాడీ తనకు తానే స్పెల్లింగ్ రాసుకుంటే ఇలా ఉంటానని చెబుతోంది ఇషా తల్వార్.

డీప్ కట్ వేర్ తొంగి చూస్తున్న ఇషా అందాలు ఈ ఫోటోకు అసలైన ఆకర్షణ. అలాగే స్కిన్ టోన్ తోత మెరిపిస్తున్న మెరుపులు మరో అట్రాక్షన్. కొంతకాలం క్రితం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ పక్కన ఓ యాడ్ లో కూడా మెరిసిన ఈ బ్యూటీకి.. ఆ స్థాయి అవకాశం సినిమాల్లో అందితే మాత్రం.. ఎవరికీ అందనంత వేగంగా దూసుకపోవడం ఖాయం.