Begin typing your search above and press return to search.
బికినీలు ఫెయిల్.. మకాం మారుస్తోంది
By: Tupaki Desk | 5 March 2018 11:30 PM GMTముంబై భామ ఇషా తల్వార్ తన కెరీర్ ను మలయాళ సినిమాలతో మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇతర భాషల నుంచి ఆఫర్స్ రావడంతో.. అన్ని చోట్లా ప్రయత్నాలు చేసింది. తెలుగులో గుండె జారి గల్లంతయిందే.. మైనే ప్యార్ కియా.. రాజా చెయ్యి వేస్తే చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం అనుకోకుండా హిందీ నుంచి పిలుపు వచ్చింది ఈ భామకి.
ట్యూబ్ లైట్ మూవీలో క్యామియో చేసే ఛాన్స్ రావడం.. కాలాకాండిలో వచ్చిన ఆఫర్ తో ముంబైలో పాగా వేసేందుకు బాగానే ట్రై చేసింది ఇషా తల్వార్. బికినీ పోజులతో సోషల్ మీడియాను బాగానే వేడెక్కించింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. బాలీవుడ్ ఈ భామను అసలు పట్టించుకోనే లేదు. బికినీలు కూడా ఫెయిల్ అయ్యాయ్. రెండేళ్ల పాటు తన వంతు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ పూర్తయిపోయినాక.. ఇప్పుడు తీరిగ్గా మళ్లీ కేరళకు మకాం మార్చేందుకు ప్రిపేర్ అయిపోయింది ఇషా తల్వార్. మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానంటూ.. కవరింగ్ కబుర్లు కూడా చెప్పేస్తోంది.
దక్షిణాది సినిమాలలో నటించి బోలెడంత నేర్చేసుకున్నానని అంటున్న ఇషా తల్వార్.. మలయాళ సినీ పరిశ్రమలో అయితే ట్యాలెంట్ కి బోలెడంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెబుతోంది. అందుకే అదే పరిశ్రమపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట. నిజానికి వాళ్లు తప్ప మరెవరూ ఈమెను అసలు పట్టించుకోవడమే లేదు.. అదీ అసలు విషయం.