Begin typing your search above and press return to search.

‘రోగ్’ హీరో గంటసేపు ఏడ్చాడట

By:  Tupaki Desk   |   15 March 2017 8:53 AM GMT
‘రోగ్’ హీరో గంటసేపు ఏడ్చాడట
X
పూరి జగన్నాథ్ తో పని చేసిన హీరోలందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. పూరి చేతుల మీదుగా హీరోగా మారుతున్న ఇషాన్ కూడా తన గాడ్ ఫాదర్ గురించి అలాగే చెబుతున్నాడు. ‘రోగ్’ సినిమా కోసం పూరితో పని చేయడం తన జన్మజన్మల అదృష్టమని అతనంటున్నాడు. మామూలు కుర్రాడిలా ఉన్న తనను పూరి చాలా చాలా మార్చేసి.. ఒక ‘రోగ్’ లాగా చేసేశాడని ఇషాన్ అన్నాడు. ‘రోగ్’ సినిమా పూర్తయిపోయినపుడు తాను పడ్డ వేదన అంతా ఇంతా కాదని.. దాదాపు గంట పాట ఏడుస్తూ ఉండిపోయానని.. ఈ విషయం పూరికి కూడా చెప్పలేదని ఇషాన్ తెలిపాడు.

‘‘పూరి గారి గురించి నేనేం చెప్పాలి. అలాంటి గొప్ప దర్శకుడి చేతుల మీదుగా నేను హీరో కావడం అదృష్టం. ఆయన నన్ను ఒక కొడుకు లాగా చూసుకున్నాడు. ‘రోగ్’ ట్రైలర్లో.. ప్రోమోలు చూసి నాకిది తొలి సినిమా లాగా లేదు అని జనాలు అంటున్నారంటే అందుకు కారణం పూరి గారే. ఆయనున్నారనే ధైర్యంగా నటించాను. పూరి గారిది గొప్ప మనసు. ఆయనతో పని చేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది. ‘రోగ్’ సినిమా షూటింగ్ రోజుల్లో ప్యాకప్ చెప్పగానే నాకు బాధేసేది. మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందా.. మళ్లీ షూటింగుకి వెళ్దామా అనిపించేది. అలాంటిది సినిమా పూర్తయ్యేసరికి చాలా బాధేసింది. గంట సేపు ఏడ్చాను. ఈ విషయం పూరి గారికి కూడా తెలియదు. పూరి గారే కాదు.. వాళ్లావిడ కూడా నన్ను అమ్మలాగా చూసుకుంది. రేప్పొద్దున నేనేదైనా చెడ్డ పని చేసినా జూబ్లీహిల్స్ లో వాళ్లింటికి వెళ్లి నా గురించి కంప్లైంట్ చేయొచ్చు. ఆమె నాకు అమ్మ’’ అని ఇషాన్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/