Begin typing your search above and press return to search.
రోగ్ హీరోతో నితిన్ డైరెక్టర్
By: Tupaki Desk | 7 Dec 2017 5:19 AM GMTహీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ స్టైలే వేరుగా ఉంటుంది. కేర్ లెస్ హీరోయిజంను బ్రాండ్ గా చూపించే పూరీ.. అదే స్టైల్ లో ఇషాన్ ను కూడా రోగ్ మూవీతో ఇంట్రడ్యూస్ చేశాడు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. జనాలకు మాత్రం ఇషాన్ బాగానే నోటీస్ అయ్యాడు.
ఇప్పుడీ కుర్రాడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టేశాడు. గుండె జారి గల్లంతయిందే అంటూ నితిన్ కు మంచి సక్సెస్ అందించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా - ఇషాన్ కాంబినేషన్ లో ఓ మూవీ ఖాయమైందని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ నచ్చడం.. హీరో రోల్ ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని తరహాగా ఉండడంతో.. రోగ్ నిర్మాత సిఆర్ మనోహర్.. విజయ్ కుమార్ కొండాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రం కోసం ఇషాన్ మేకోవర్ చేయాల్సి ఉండగా.. ఇప్పటికే తన ప్రయత్నాలను కూడా ప్రారంభించేశాడని తెలుస్తోంది. మూడేళ్లుగా సినిమాలు చేయని ఈ దర్శకుడు ఇప్పుడు వరుస ప్రాజెక్టులను కుదుర్చుకుంటున్నాడు.
రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కాల్సి ఉంది. మూవీపై ప్రకటన వచ్చి చాలాకాలమే అయినా.. ఇంకా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇషాన్.. రాజ్ తరుణ్.. వీరిద్దరిలో ఎవరి సినిమాను విజయ్ కుమార్ కొండా తొలుత ప్రారంభిస్తాడనే అంశంపై క్లారిటీ లేదు.