Begin typing your search above and press return to search.
'ఇష్క్' రెగ్యులర్ తెలుగు సినిమా కాదు.. చాలా అరుదుగా వచ్చే చిత్రం: తేజ సజ్జా
By: Tupaki Desk | 24 July 2021 1:30 PM GMT'జాంబిరెడ్డి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో తేజ సజ్జ.. ఇప్పుడు ''ఇష్క్'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి రీమేక్. ఎస్.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జూలై 30న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన పరిస్థితుల్లో ధైర్యం చేసి థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్న మొదటి హీరో తేజ సజ్జ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన తేజ 'ఇష్క్'- నాట్ ఏ లవ్ స్టోరీ చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు.
- 'ఇష్క్' కొత్త రకమైన కంటెంట్ తో న్యూ స్టైల్ ఆఫ్ మేకింగ్ రూపొందిన సినిమా. హీరో హీరోయిన్ లు ఇలా ఉండాలి.. కథ ఇలా ఉండాలి.. అనే రెగ్యులర్ తెలుగు సినిమాలను బ్రేక్ చేసే చిత్రమిది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనే థ్రిల్ ఉంటుంది. 1 గంటా 55 నిమిషాల నిడివితో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థిల్లర్ గా ఉండబోతోంది.
- మలయాళ వెర్సన్ లో మార్పులు చేశాం కానీ.. కథలో మాత్రం ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఒరిజినల్ తో పోలిస్తే సినిమా రన్ టైమ్ ను తగ్గించి ఇంకా గ్రిప్పింగ్ ఉండేలా సినిమాని రెడీ చేశాం. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. 'ఓ బేబీ' 'జాంబిరెడ్డి' చిత్రాల్లో అందరితో పాటు తేజ బాగా చేసాడని అన్నారు. కానీ ఈ సినిమాతో ప్రత్యేకంగా నా గురించే మాట్లాడతారు.
- కరోనా రెండవ వేవ్ సమయంలో సినిమా ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అవుతుందనే దాని గురించి అందరూ ఆలోచించారు. కానీ చివరకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ లాంటి వారి కంటే బెటర్ గా సినిమాని ఎవరు రిలీజ్ చేయగలరు అనుకున్నాను. ఎన్.వి.ప్రసాద్ గారు ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్. వారి కంటే సినిమాని విడుదల గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది?.
- నేను భవిష్యత్తు ఎలా ఉంటుందని కొంచెం భయపడ్డాను కానీ 'ఇష్క్' సినిమా గురించి మాత్రం ఆందోళన లేదు. ఎందుకంటే ఇది మంచి కంటెంట్ తో తీసిన సినిమా. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. నాకు మంచి పేరు వస్తుందని, సినిమా విడుదలైన తర్వాత గుర్తింపు లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అందువల్ల నేను ఈ సినిమా గురించి నిజంగా చింతించలేదు.