Begin typing your search above and press return to search.
వామ్మో... మరీ ఇంత బూతా?
By: Tupaki Desk | 31 Jan 2016 10:30 PM GMTఅర్ధనగ్నంగా.. కాదు కాదు 80 శాతం నగ్నత్వంతో ఓ అమ్మాయి. ఆమె ఒకంటిపై చిన్న బ్రా మినహా ఇంకేమీ కనిపించట్లేదు. జుట్టుతో ముఖం దాచుకుని ఇద్దరు మగాళ్లను తనవైపు లాక్కుంటోంది. కండలు తిరిగిన ఆ ఇద్దరు మగాళ్లు నేరుగా ఆమె ఎదపైనే చేతులు వేసేశారు. ఆ రెండు చేతులకూ సంకెళ్లు పడిపోయాయ్. బహుశా ఆమె అందానికి ఇద్దరూ బందీలైపోయారో ఏమో. ఇదీ ‘ఇష్క్ జునూన్’ పోస్టర్ తీర్చిదిద్దిన తీరు. ‘ఇండియాస్ బోల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎరోటిక్ ఫిలిం’ అని ట్యాగ్ వేసుకుని మరీ వస్తున్న సినిమా ఇది. మరి ఆ ట్యాగ్ వేసుకున్నాక మామూలు పోస్టర్ వదిలితే ఎలా? అందుకే ఇలా హద్దులు దాటేశారు. గత కొన్నేళ్లుగా బోల్డ్ మూవీస్ పేరుతో బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎలాంటి సినిమాలు తీస్తున్నారో.. వాటికి ఎలాంటి వసూళ్లు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఆ కోవలోనే ‘ఇష్క్ జునూన్’ బాలీవుడ్ ను బూతు విషయంలో మరో మెట్టు ఎక్కించడానికి సిద్ధమవుతోంది. అందరూ కొత్తవాళ్లే నటిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.