Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ఎస్టుపేండో... గురేరో... ఇజం
By: Tupaki Desk | 5 Sep 2016 4:59 PM GMTఇజం అంటే అలవాటైన మాటే. ఏదో ఒక ఇజం అని అర్థం చేసుకొంటాం. కానీ ఈ ఎస్టుపేండో - గురేరో అంటేనే కాస్త తికమకగా ఉంది కదూ! అదే మరి పూరి జగన్నాథ్ మార్క్ అంటే. స్పానిష్ పదాలివి. ఎస్టుపేండో అంటే గ్రేట్ అని అర్థం. గురేరో అంటే వారియర్ అని అర్థం. కొద్దిసేపటి క్రితమే విడుదలైన `ఇజం` టీజర్ నిండా ఇలాంటి స్పానిష్ పదాల్నే ఉపయోగించాడు పూరి. టీజర్‌లో వినిపిస్తున్న పదాల్నిబట్టి కళ్యాణ్ రామ్ ని ఇజంలో ఓ గ్రేట్ వారియర్ గా చూపించబోతున్నాడన్నమాట. ఐ డక్ యు - ఐ డక్ హిమ్ - ఐ డక్ ఎవ్రీవన్... అంటూ కళ్యాణ్ రామ్ చివరిగా ఓ డైలాగ్ చెబుతాడు. అంటే ఎవర్నీ లెక్కచేయని ఓ యువకుడిగా కళ్యాణ్ రామ్ పాత్ర ఉంటుందన్నమాట. పూరి `ఇజం`ని చాలా క్లాస్ గా - రిచ్ గా సగటు తెలుగు చిత్రాలకి భిన్నంగా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. కళ్యాణ్ రామ్ పాత్ర ఓ జర్నలిస్టుగా ఉంటుందని సమాచారం.
కానీ అన్ని సినిమాల్లో కనిపించే జర్నలిస్టుగా కళ్యాణ్ రామ్ కనిపించడం లేదు. చాలా మాస్ లుక్ తో ఓ పోకిరిలా కనిపిస్తున్నాడు. మరి ఆ గెటప్ లో కళ్యాణ్ రామ్ ని ఎలాంటి జర్నలిస్టుగా చూపించాడన్నది ఆసక్తికరం. టీజర్ లో ఫైట్ సన్నివేశాలు - కళ్యాణ్ రామ్ సిక్స్ బాడీనే హైలెట్టుగా నిలిచాయి. షూటింగ్ చివరి దశకు చేరుకొంది కాబట్టి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.