Begin typing your search above and press return to search.
ఇజం.. బయ్యర్లకు ఆవిరి సగం!!
By: Tupaki Desk | 27 Oct 2016 4:38 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ బోలెడంత నమ్మకంతో చేసేసిన మూవీ ఇజం. తన సినిమాలను తనే నిర్మించుకునే కళ్యాణ్ రామ్.. ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయలేదు. ఆ కొరత తీరనుండడంతో.. ఇజంపై భారీగానే ఖర్చుపెట్టేశాడు. అది తన సినిమా వసూళ్లకు కంటే చాలా ఎక్కువే.
ఇప్పుడు ఇజం పరిస్థితి చూస్తుంటే.. పెట్టుబడిలో సగం కూడా వచ్చేటట్లుగా కనిపించడం లేదు. తొలి వీకెండ్ లోనే 8 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఇజం.. ఆ తర్వాత బాగా స్లో అయిపోయింది. వీకెండ్ డేస్ లో నైజాం ఏరియాలో 77 లక్షలు.. 67 లక్షలు చొప్పున మాత్రమే వసూళ్లు రాబట్టిన ఇజం వసూళ్లు.. వీక్ డేస్ లో నాటికి 10 లక్షల దిగువకు పడిపోయాయి. దీంతో ఇక కోలుకోవడం అసాధ్యం అనేసంగతి తేలిపోయింది. పైగా ఈ శుక్రవారం కాష్మోరా.. ధర్మయోగి వంటి డబ్బింగ్ చిత్రాల దాడి ఉండడంతో.. రెండో వీకెండ్ పై కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు.
ఇజంపై నందమూరి కళ్యాణ్ రామ్ 26 కోట్లు పెట్టుబడి పెట్టగా.. 2 కోట్ల లాస్ తో 24 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మేశాడు. ఈ నష్టాన్ని కూడా శాటిలైట్ ద్వారా రాబట్టుకునే అవకాశం ఉంది కానీ.. బయ్యర్స్ కి మాత్రం కనీసం సగం నష్టాలు తప్పకపోవచ్చని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇజం మూవీ ఫుల్ రన్ లో 13-14 కోట్ల షేర్ సాధిస్తుందనే లెక్కలు వేయడమే ఇందుకు రీజన్. అలా ఇజంపై పెట్టుబడి పెట్టినోళ్లకు సగం ఇన్వెస్ట్ మెంట్ ఆవిరి అయిపోతున్నట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/