Begin typing your search above and press return to search.

పూరీ మార్క్ ఫ్లాప్ ఇది

By:  Tupaki Desk   |   18 Nov 2016 3:30 PM GMT
పూరీ మార్క్ ఫ్లాప్ ఇది
X
డైరెక్టర్ పేరు చూసి థియేటర్స్ కి ఆడియెన్స్ వచ్చేలా చేసిన వాళ్ల లిస్ట్ లో పూరీ జగన్నాథ్ పేరు టాప్ లో ఉంటుంది. తన క్రియేటివ్ తో.. డైలాగ్స్ తో.. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ సెట్ చేసుకొన్న పూరీకి ఫ్యాన్స్ చాలా మందే. కానీ సినిమా సినిమాకి పూరీనే స్వయంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే.. ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. పూరీ చేతిలో పడితే తమ కెరీర్ న్యూ టర్న్ తీసుకోవడం గ్యారంటీ అని ఆశలు పెట్టుకొన్న హీరోల్ని కూడా నిలువునా ముంచేస్తున్నాడు.

మొన్న లోఫర్ విషయంలో వరుణ్ తేజ్ ఇలాగే దెబ్బైపోయాడు. ఇప్పుడు కల్యాణ్ రామ్ వంతు. ఇజమ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనుకుంటే నేనింతే అని రోటీన్ మూవీ తీశాడు పూరీ. లుక్స్ పరంగా కల్యాణ్ రామ్ మేకోవర్ ని టోటల్ గా మార్చేశాడు ఇజం కోసం. టీజర్స్.. ట్రైలర్స్ చూసి ఈ సారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే ఫీలింగ్ ఇచ్చాడు. ఈ దెబ్బకి కల్యాణ్ రామ్ దశ తిరిగిపోవడం షూర్ అనుకొన్నారంతా. కానీ అవేవీ జరగలేదు. పైగా చాలా సహజంగానే ఇద్దరికీ కలిసి ఓ ఫ్లాప్ పడింది.

పటాస్ తర్వాత తన పోజిషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని పట్టుదలగా ఉన్న కల్యాణ్ రామ్- పూరీ ఎంత బడ్జెట్ చెప్పినా కాదనకుండా ఖర్చు పెట్టేశాడు. ఓపెనింగ్ డే కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కొత్త ఊపిరి ఇచ్చినా.. ఆ తర్వాత మాత్రం డ్రాపైపోయాయ్. రేస్ లో గట్టి పోటీ ఇచ్చే సినిమాలు ఏవీ లేకపోయినా ఇజమ్ వైపు జనాలు చూడలేదు. ఓవరాల్ గా 25 శాతం నష్టాలు వచ్చాయంటున్నారు. అసలే షేర్ తో దెబ్బ తిని ఉన్నాడు కల్యాణ్ రామ్. ఇజమ్ కూడా దారుణమైన రిజల్ట్ ఇచ్చే సరికి కోలుకోడానికి టైమ్ పట్టేలానే ఉంది. ఫ్లాప్ లో హీరో కన్నా పూరీకే ఎక్కువ క్రెడిట్ అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/