Begin typing your search above and press return to search.
ఆడియన్స్.. ధియేటర్స్.. అంతా ఇజం
By: Tupaki Desk | 20 Oct 2016 5:30 PM GMTతెల్లారితే శుక్రవారం.. ప్రతీ ఫ్రైడే మాదిరిగానే ఈ సారి కూడా బాక్సాఫీస్ దగ్గర సినిమా పండగ మొదలైపోతోంది. గత కొన్ని వారాలుగా టికెట్ కౌంటర్ల దగ్గర ఎవరు గెలుస్తారా ముందే తెలిసిపోతోంది. ఈ వారం కూడా దాదాపు అదే పరిస్థితి అని చెప్పాల్సిందే.
రేపు పొద్దు పొద్దునే ఐదు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటన్నిటిలోకి ఇజం ఒక్కదానికే ఆడియన్స్ లో బజ్ కనిపిస్తోంది. జనాల పల్స్ తెలిసిన పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కావడం.. నందమూరి అభిమానులు ఉత్సాహంగా ఉండడం.. ఇజంకు కలిసొచ్చే విషయాలు. ఇప్పటివరకూ అడ్వాన్స్ బుకింగ్స్.. అభిమానుల ఉత్సాహం చూస్తే.. ఇజం కోసం ఆడియన్స్ వెయిటింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. అయితే.. మిగతా సినిమాల సిట్యుయేషన్ కూడా అర్ధం అయిపోతోంది. నారా రోహిత్ మూవీ శంకర అక్టోబర్ 21నే థియేటర్లలోకి వస్తోంది. కానీ పిసరంత కూడా పబ్లిసిటీ లేకుండా.. ప్రచారం చేయకుండానే కోలీవుడ్ మౌనగురు రీమేక్ గా తెరకెక్కిన శంకరను థియేటర్లలోకి వదిలేస్తున్నారు.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో నవీన్ విజయ్ కృష్ణ నటించిన నందినీ నర్సింగ్ హోమ్ కూడా రేపే రిలీజ్. స్వయంగా మహేష్ బాబు ఆడియో లాంఛ్ చేసినా.. ఈ మూవీపై హైప్ ఏర్పడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. హాట్ యాంకర్ కం ఘాటు హీరోయిన్ అయిన రష్మీ గౌతమ్ నటించిన తను వచ్చినంట అనే జాంబీ కామెడీ చిత్రం కూడా థియేటర్లలోకి వస్తోంది. ఇవి కాకుండా.. ఎల్7 అనే చిన్న సినిమా కూడా పోటీ పడుతోంది కానీ.. పెద్దగా అంచనాలు లేవు. మరి ఈ వారం బాక్సాఫీస్ విన్నర్ గా ఎవరు నిలిచే ఛాన్స్ ఉందో అర్ధమైందిగా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/