Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ వయ్యారి చీరకట్టుతో ఆకట్టుకుంటుందిగా..!

By:  Tupaki Desk   |   15 Jan 2021 8:30 AM GMT
ఇస్మార్ట్ వయ్యారి చీరకట్టుతో ఆకట్టుకుంటుందిగా..!
X
కుర్రభామ నిధి అగర్వాల్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముంబైలో సెటిల్ అయిన ఈ హైదరాబాదీ వయ్యారి.. టైగర్ ష్రాఫ్ సరసన 'మున్నా మైకెల్' సినిమాతో హీరోయిన్ గా సినిమాలలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో నిధిని చూసిన ప్రతి ఒక్కరు అదిరిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అమ్మడి గ్లామర్ షో అదిరిపోయింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు.

ఇక లాభం లేదని 'సవ్యసాచి' సినిమాతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో అమ్మడు భారీ గ్యాప్ తీసుకొని 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది. వరుసగా చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఏం చేయాలో తెలియక మళ్లీ గ్యాప్ తీసుకొని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది.

సినిమాలతో పాటు అప్పుడప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీల కోసం ఫోటోషూట్ లో మెరుస్తుంది నిధి. ముఖ్యంగా మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోలలో నిధి అందాలన్నీ వేడెక్కిస్తున్నాయని అనుకోకతప్పరు. ఎల్లప్పుడూ స్పైసి అందాలను ఆరబోసే నిధి.. తాజాగా సారీ ధరించి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. మెరూన్ కలర్ చీరలో నిధి చూడచక్కగా ఉందని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో ఘాటైన క్లీవేజ్ షోతో అదరగొట్టే నిధి ఇప్పుడు ఇలా ట్రెడిషనల్ లుక్కులో కనిపించేసరికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే నిధి గ్లామర్ రహస్యం మాత్రం.. మేకప్, ఆభరణాలు లేకుండా ఉండటమే అని చెబుతోంది. ఇక తాజాగా సంక్రాంతి సందర్బంగా నిధి నటించిన ఈశ్వరన్ అనే తమిళ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమానే కాకుండా తమిళ హీరో జయం రవి సరసన నటించిన భూమి సినిమా కూడా హాట్ స్టార్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.