Begin typing your search above and press return to search.

వాన పాటలంటే ఆ బ్యూటీకి వణుకేనట..

By:  Tupaki Desk   |   25 July 2021 9:49 AM GMT
వాన పాటలంటే ఆ బ్యూటీకి వణుకేనట..
X
సినిమా అంటే పాట ఉండాలి. అందులో హీరోహీరోయిన్ల మధ్య నడిచే రొమాంటిక్ సాంగ్ కు ఉండే ప్రత్యేక ఆకర్షణ ఒక ఎత్తు అయితే.. జోరున పడే వానలో నాయికానాయకులు తడిచిపోతూ.. చెలరేగిపోయి వేసే స్టెప్పులు థియేటర్లో చూసే ప్రేక్షకులకు సైతం చిక్కిలిగింతలు పెడుతుంటాయి. ఇంతటి ఫీల్ తెచ్చే పాటలు చూడటానికి బాగున్నా.. చేసే వారికి మాత్రం చుక్కలే కనిపిస్తాయి. వానలో చాలామందికి తడవటం ఇష్టం కానీ.. వాన పాటల్లో యాక్ట్ చేయాల్సి వస్తే మాత్రం హీరోహీరోయిన్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పింది నిధీ అగర్వాల్. కుర్రాకారుకు గుబులు పుట్టించే అందాలతో మెరిసే నిధికి.. వానపాట చేయటం ఏ మాత్రం ఇష్టం ఉండదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

ఇంట్లో కూర్చొని.. కిటికీ లో నుంచి పడే చిరుజల్లుల్ని చూసి ఎంజాయ్ చేయటం.. వేడివేడిగా పకోడీలు తినటం బాగున్నా.. అదే వానలో పాట చేయాలంటే మాత్రం చిక్కులేనని చెబుతోంది. వాన పాట చేయటం అంత ఈజీ కాదని.. నటిస్తున్నప్పుడు తడవటం.. షాట్ గ్యాప్ లో ఆరబెట్టుకోవటం.. మళ్లీ తడవటం.. బాబోయ్ అనేస్తుంది.

అన్నింటికి మించి.. వానజల్లు పడుతుంటే.. కళ్లు తెరిచి ఉంచి.. నటించటం అంత ఈజీ కాదని ఆమె చెబుతోంది. అందుకే వానపాట గురించి అస్సలు ఆలోచించటం లేదన్న ఈ ముద్దుగుమ్మకు వానపాట తప్పనిసరి అన్న కండీషన్ తో ఛాన్స్ వస్తే ఏం చేస్తుందో చూడాలి. మొత్తంగా వానపాటను చూసేందుకు బాగున్నా.. చేసే విషయంలో మాత్రం ఎన్ని చిక్కులన్నది నిధి అగర్వాల్ మాటల్ని వింటే ఇట్టే అర్థం కాక మానదు.