Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ సుందరి హీరోలకు ధీటుగా రికార్డులు బద్దలు..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 8:30 AM GMT
ఇస్మార్ట్ సుందరి హీరోలకు ధీటుగా రికార్డులు బద్దలు..!
X
టాలీవుడ్ యంగ్ గ్లామర్ క్వీన్ నిధి అగర్వాల్. ఈ ఇస్మార్ట్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముంబైలో సెటిల్ అయినటువంటి ఈ హైదరాబాదీ బ్యూటీ.. టైగర్ ష్రాఫ్ సరసన 'మున్నా మైకెల్' అనే సినిమాతో హీరోయిన్ గా సినీ ప్రయాణం ప్రారంభించింది. డెబ్యూ మూవీలో ఈ గ్లామర్ బ్యూటీని చూసి ప్రతి ఒక్కరు బాబోయ్ అదిరింది అనుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అమ్మడి టాప్ టు బాటమ్ గ్లామర్ షో చేసేసింది. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. అలాగే వయ్యారికి అవకాశాలు కూడా రాలేదు. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా నిధి 'సవ్యసాచి' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది.

ఆ మూవీ కూడా ప్లాప్ అవ్వడంతో అమ్మడు గ్యాప్ తీసుకొని మరీ 'మిస్టర్ మజ్ను' సినిమా చేసింది. ఆఖరికి ఈ సినిమా కూడా ప్లాప్. వరుసగా చేస్తున్న సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఏం చేయాలో తెలియక మరో భారీ విరామం తీసుకొని అమ్మడు.. ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది. ఈ సినిమాలో మొత్తంగా అందాలు ఆరబోసి మొదటి హిట్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు యువతకు అమ్మడు గ్లామర్ క్వీన్ అయిపోయింది. అయితే సినిమాలు చేస్తోంది కానీ స్టార్డం అందుకోలేకపోతుంది. ఇదిలా ఉండగా.. తెలుగు సినిమాలు యూట్యూబ్ వేదికగా హిందీలో డబ్ అవుతుంటాయని తెలిసిందే. ఈ మధ్యకాలంలో తెలుగులో ఫెయిల్ అయినటువంటి సినిమాలు యూట్యూబ్ లో హిందీ వెర్షన్ కోట్లలో వ్యూస్ తెచ్చుకొని మిలియన్స్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.

అయితే మాములుగా హీరోయిన్స్ యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేయడం గురించి అరుదుగా వింటుంటాం. కానీ నిధి అగర్వాల్ అలా కాదు. తాను ఇప్పటివరకు చేసిన తెలుగు సినిమాలు అన్నింటితో యూట్యూబ్ లో రికార్డులు నమోదు చేసింది. హీరోయిన్స్ అంటే సాంగ్స్ తో యూట్యూబ్ రికార్డులు కొల్లగొట్టడం చూసాం. కానీ అమ్మడు నటించిన సినిమాలు హిందీ డబ్ వెర్షన్ లో వందల సంఖ్యలో మిలియన్స్ నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం నిధి నటించిన ఫస్ట్ మూవీ సవ్యసాచి 130మిలియన్స్ క్రాస్ చేయగా.. ఇక మిస్టర్ మజ్ను మూవీ 200 మిలియన్స్ కాగా.. నిధి ఫస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఏకంగా 202 మిలియన్స్ క్రాస్ చేసి ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో నిధి కూడా హీరోలకు పోటీగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అమ్మడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం నిధి పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తుంది.