Begin typing your search above and press return to search.
శంకర్ నాన్ స్టాప్ - 3 డేస్ కలెక్షన్స్
By: Tupaki Desk | 21 July 2019 7:00 AM GMTసినిమాలకు అందులోనూ మాస్ మూవీస్ కి రిలీజ్ విషయంలో టైమింగ్ చాలా ముఖ్యం. కంటెంట్ సంగతి పక్కన పెడితే ఏ సమయంలో విడుదల చేస్తున్నాం పోటీలో ఎవరున్నారు ఎవరు లేరు అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకోసారి ఇలాంటి క్యాలికులేషన్స్ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇస్మార్ట్ శంకర్ ప్రస్తుతం ఈ స్థితినే బాగా అనుభవిస్తోంది. గత ఐదారు నెలలుగా సరైన మాస్ మసాలా సినిమా లేక కరువు లాంటి పరిస్థితిని ఎదురుకుంటున్న బాక్స్ ఆఫీస్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో మంచి జోష్ దక్కింది.
సినిమా గురువారమే వచ్చేయడంతో వసూళ్లకు ఇంకో రోజు అదనంగా కలిసి వచ్చి వీకెండ్ మొత్తం శంకర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా నాలుగు రోజుల రన్ కే సుమారుగా 16 కోట్ల 70 లక్షల దాకా షేర్ వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. పూరికి కాదు కానీ ఇది రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిగర్. ఇక ఈ రోజు కూడా ఇదే జోరు కొనసాగనుంది. కనీస పోటీ ఇచ్చే సినిమాలు ఏవి లేదు. మిస్టర్ కేకే-ఆమె తమిళ డబ్బింగులు వచ్చాయి కానీ వాటికి కనీస ఆదరణ లేక కొన్ని సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ తోనో లయన్ కింగ్ తోనో రీ ప్లేస్ చేసేంత దారుణంగా ఉంది రిపోర్ట్.
గత వారం వచ్చిన నిను వీడని నీడను నేనే కూడా బాగా స్లో కావడం దొరసాని ఏ వర్గాన్ని మెప్పించలేకపోవడం లాంటివన్నీ స్మార్ట్ శంకర్ కు సూపర్ గా కలిసొస్తున్నాయి. మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చే సినిమాలు సంక్రాంతి తరువాత ఒక్కటీ రాకపోవడం ఇస్మార్ట్ శంకర్ కు పెద్ద ప్లస్ గా నిలుస్తోంది. మహర్షి ఆ లోటుని కవర్ చేసినప్పటికీ అందులో ఇంత ఊర మాస్ లేదు. పైగా మహేష్ చాలా క్లాస్ రోల్ పోషించాడు. అందుకే కంటెంట్ ఎలా ఉన్నా ప్రెజెంటేషన్ గురించి మిక్స్డ్ టాక్ ఉన్నా ఇస్మార్ట్ శంకర్ కు అవేవి ప్రతికూలంగా మారలేదు. రేపటి నుంచి రన్ ఎలా ఉండబోతోందనే దాని మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది
నైజాం - 7.36 కోట్లు
సీడెడ్ - 2.80 కోట్లు
వైజాగ్ - 1.90 కోట్లు
ఈస్ట్ గోదావరి - 1.09 కోట్లు
వెస్ట్ గోదావరి - 0.84 కోట్లు
కృష్ణ - 1.05 కోట్లు
గుంటూరు - 1.14 కోట్లు
నెల్లూరు - 0.55 కోట్లు
తెలుగు రాష్ట్రాల 3 రోజులు షేర్(అంచనా) -16.71 కోట్లు