Begin typing your search above and press return to search.
ఇస్మార్ట్ శంకర్ డబుల్ సెంచరీ
By: Tupaki Desk | 30 May 2021 2:07 PM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ హీరోయిన్ లుగా నటించిన ఇస్మార్ట్ శంకర్ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో దర్శకుడిగా సక్సెస్ ను దక్కించుకున్నాడు. రామ్ కూడా వరుస ప్లాప్ ల నుండి బయట పడ్డాడు. ఇక ఒకే సినిమా ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో బిజీ అయ్యేలా చేసింది. తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో డబ్బింగ్ అయ్యి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీ వర్షన్ తెగ వ్యూస్ ను దక్కించుకోవడం చాలా కామన్ అయ్యింది. తెలుగు సినిమా లు ఉత్తరాదిన శాటిలైట్ ద్వారా మరియు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటున్న నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండటంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది. 200 మిలియన్ ఈ సినిమా పూర్తి చేసుకుంది.
తక్కువ సమయంలోనే 20 కోట్ల వ్యూస్ ను ఈ సినిమా దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ టాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ ఇతర సినిమాలు కూడా హిందీలో డబ్ అయ్యి వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నాయి. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ద్విభాష సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.