Begin typing your search above and press return to search.
స్మార్ట్ కాదు హాట్ ఓపెనింగ్స్ వచ్చాయిగా
By: Tupaki Desk | 18 July 2019 10:47 AM GMTఅంచనాలకు తగ్గట్టే ఇస్మార్ట్ శంకర్ ఓపెనింగ్స్ తో ఆడేసుకున్నాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ తో మొదలుకుని క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ దాకా బెజవాడ సినీ పోలీస్ నుంచి కర్నూల్ శ్రీరామ టాకీసు దాకా అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో భీకరమైన వసూళ్లు తెచ్చాడు.రోజు పూర్తి కాకుండానే వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్ సైతం షాక్ అవుతోంది. అలా అని ఇది రామ్ సినిమా అనో పూరి బ్రాండ్ వల్లో వచ్చాయని అనుకోవడానికి లేదు. ప్రమోషన్ లో పక్కా మాస్ మూవీగా ప్రొజెక్ట్ చేయడం ఇవాళ అతి పెద్ద ప్లస్ గా నిలిచింది.
రామ్ గత సినిమా హలో గురు ప్రేమ కోసమేకు పూరి లాస్ట్ మూవీ మెహబూబాకు ఇందులో సగం కాదు పావు వంతు ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఇస్మార్ట్ శంకర్ కోసం కలిసిన ఈ కాంబోకు మాత్రం బ్రహాండమైన ఫిగర్స్ వస్తున్నాయి అంటే దానికి కారణం మాస్ ప్రేక్షకుల అండనే. ఇది హిట్టా ఫట్టా అని ఇవాళే చెప్పడం తొందరపాటుతనమే అవుతుంది. రెస్పాన్స్ పరంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ దాటాలి. పైగా ఇస్మార్ట్ శంకర్ మొదటి రెండు రోజులు అడ్వాన్స్ బుకింగ్ మీదే నడుస్తోంది. ఆదివారం అయ్యాక సోమవారం నుంచి శంకర్ ఎలా రన్ అవుతాడు అనేదాని మీద స్టేటస్ ని డిసైడ్ చేయొచ్చు.
టాక్ తో సంబంధం లేకుండా ఇదే జోరు కొనసాగితే థియేట్రికల్ బిజినెస్ జరిగిన 18 కోట్లు ఈజీగానే వచ్చేస్తాయి. అలా కాకుండా మండే కలెక్షన్స్ లో డ్రాప్ ఎక్కువగా ఉందంటే లెక్క మారుతుంది. ఇది తేలడానికి ఓ ఐదు రోజులు గడవాల్సిందే. మాస్ బ్రాండ్ పుణ్యమా అని రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ న ఈరోజు తెచ్చేసుకున్నాడు. ఫారిన్ ట్రిప్ కారణంగా ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడ లేకపోయినా ఈపాటికే మెసేజులు వెళ్ళిపోయి ఉంటాయి