Begin typing your search above and press return to search.
మిక్సీ మసాలా - ఆడియో రివ్యూ
By: Tupaki Desk | 15 July 2019 11:23 AM GMTపూరి జగన్నాధ్ హీరో రామ్ ల ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఇస్మార్ట్ శంకర్ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంత కాలంగా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన సినిమాలేవీ లేకపోవడంతో ఆ వర్గానికి దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ విషయంలో రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉన్నప్పటికీ సినిమా చూసాక అదే ప్లస్ అవుతుందన్న అభిప్రాయంలో యూనిట్ ఉంది. ఇప్పుడు దీని పూర్తి ఆల్బమ్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. స్వరబ్రహ్మ మణిశర్మ కంపోజింగ్ లో ఇందులో మొత్తం 5 పాటలున్నాయి
మొదటిది ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్. హీరో పాత్ర స్వభావంతో పాటు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపదే శంకర్ గా భాస్కరభట్ల ఒదిగిన పదాలు అచ్చ తెలంగాణ స్లాంగ్ లో ఉంటూ క్యాచీగా సాగాయి. ఇది మణిశర్మ బెస్ట్ టైటిల్ సాంగ్స్ లో ఒకటిగా చెప్పలేం కానీ సందర్భానికి తగ్గట్టు సింక్ చేసుంటే కనక స్లో పాయిజన్ లా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
ఇక రెండో పాట దిమాక్ ఖరాబ్ ఆడియోలోనే టాప్ సాంగ్ గా చెప్పొచ్చు. రొటీన్ ట్యూన్ గా అనిపిస్తున్నా గమ్మత్తయిన రైమింగ్ తో డాబాలో ఇద్దరు హీరోయిన్ల మీద చేసే పిక్చరైజెషన్ తో మాస్ కి నచ్చే ఛాన్స్ ఉంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం ప్రత్యేకంగా ఉంది. జిందాబాద్ అంటూ సాగే మూడో పాట మణిశర్మ రెగ్యులర్ స్టైల్ లోనే సాగుతుంది. దీనికీ భాస్కరభట్లనే పదాలు కూర్చారు.
బోనాలు నేపథ్యంలో సాగే నాలుగో పాటలో కాసర్ల శ్యాం యాసతో చెడుగుడు ఆడేశాడు. గొప్పగా లేకపోయినా బీట్స్ వల్ల బోనం పండగ టైంలో ఇదే హోరెత్తిపోయే ఛాన్స్ ఉంది. చివరి సాంగ్ ఉండిపో ఉండిపో మరోసారి భాస్కరభట్ల మార్కు సాహిత్యంలో డీసెంట్ మెలోడీగా అనిపిస్తుంది.
ఫైనల్ గా పూరి-మణిశర్మ కాంబినేషన్ లో ఆల్ టైం మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన పోకిరి-చిరుత రేంజ్ లో ఈ ఆల్బమ్ లేకపోయినా ఉన్నంతలో మాస్ ని టార్గెట్ చేసి మెప్పించే ప్రయత్నం గట్టిగా చేశారు మణిశర్మ. ఆమాటకొస్తే గత కొన్నేళ్లుగా తన స్థాయి ట్యూన్స్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న మణిశర్మ నుంచి గత ఐదారేళ్ళలో ఇదే గుడ్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. ఆడియో సరే విజువల్ గా పూరి తెరమీద ఏ మేజిక్ చేశాడు అనే దాన్ని బట్టి ఇది ఇంకో మెట్టు పైకి వెళ్తుందా లేదా డిసైడ్ అవుతుంది