Begin typing your search above and press return to search.

కొత్త గెటప్ తో షాక్ ఇచ్చిన ఇస్మార్ట్ హీరో!

By:  Tupaki Desk   |   10 Aug 2019 7:47 AM GMT
కొత్త గెటప్ తో షాక్ ఇచ్చిన ఇస్మార్ట్ హీరో!
X
సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' వల్ల పూరి ఫామ్ లోకి వచ్చాడో లేదో కానీ రామ్ మాత్రం ఫామ్ లోకి వచ్చాడు. టాలీవుడ్ లో సెకండ్ లీగ్ హీరోల లిస్టులో మళ్ళీ గట్టిపోటీదారుగా మారాడు. ఇస్మార్ట్ విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ సినిమా రిలీజ్ తర్వాత తన పూర్వపు లుక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ లుక్ తోనే పూరి ఛార్మీ టీమ్ తో ఇస్మార్ట్ వేడుకల్లో పాల్గొన్నాడు.

అయితే తాజాగా తన లుక్ మరోసారి మార్చాడు. తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా కొత్త ఫోటో పోస్ట్ చేస్తూ "మైల్డ్ లీ వైల్డ్/వైల్డ్ లీ మైల్డ్?" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో కాస్త గుబురుగా ఉన్న ఫ్రెంచ్ గడ్డం.. ఆల్మోస్ట్ జీరోలో ట్రిమ్ చేసిన హెయిర్ స్టైల్ తో షాక్ ఇస్తున్నాడు. సడెన్ గా చూస్తే గుండు చేయించుకున్నట్టు కనిపిస్తోంది. మరి తన కొత్త సినిమాకోసమే ఈ షాకింగ్ మేకోవర్ తో కనిపిస్తున్నాడా.. లేదా సరదాగా గెటప్ ను మార్చాడా అనేది ఇంకా తెలియదు.

ఈ కొత్త మేకోవర్ తో నెటిజన్లు.. ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. "నీ చర్యలు ఊహాతీతం సామి.. దణ్ణం!".. "డబల్ ఇస్మార్ట్ గెటప్ లో ఉన్నవా అన్నా?".. "వాల్టర్ వైట్ లుక్?" అంటూ కామెంట్లు పెట్టారు. లాస్ట్ కామెంట్ తెలుసు కదా.. 'బ్రేకింగ్ బ్యాడ్' టెలివిజన్ సీరీస్ లో బ్రయాన్ క్రాన్ స్టన్ పాత్ర గెటప్.