Begin typing your search above and press return to search.
విధేయ రామునిపై ఇస్మార్ట్ పంచ్
By: Tupaki Desk | 24 Oct 2019 4:24 PM GMTబుల్లితెర టీఆర్పీలు నిరంతరం హాట్ టాపిక్. ఏ సినిమాకి ఎంత వ్యూయర్ షిప్ ఉంది? ఎంత టీఆర్పీ వచ్చింది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తుంటారు. ఆదివారాలు.. పండగలు పబ్బాల్లో టీవీల్లో వచ్చే ప్రీమియర్లపై దృష్టి సారిస్తుంటారు. అలా చూస్తే ఒకేరోజు టెలీకాస్ట్ అయిన వినయ విధేయ రామ- ఇస్మార్ట్ శంకర్ చిత్రాల టీఆర్పీ వ్యత్యాసం పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అన్న చందంగానే ఉంది.
అవి రెండూ మాస్ సినిమాలే అయినా `ఇస్మార్ట్ శంకర్` ఊపు ముందు వినయ విధేయ రామ నిలవలేకపోయింది. రామ్ నటించిన ఫక్తు మాస్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.44 టీఆర్పీ రాగా.. ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా 20.71 టీఆర్పీతో రికార్డ్ బ్రేక్ చేసింది. సేమ్ టైమ్ ప్రసారమైన వినయవిధేయ రామ కు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 7.85 టీఆర్పీ వచ్చింది. అంటే ఇస్మార్ట్ శంకర్ కి పోటీ సినిమాతో పోలిస్తే ఆల్మోస్ట్ డబుల్ మైలేజ్ వచ్చిందనే దీనర్థం. అయితే ఈ రెండిటికీ పోలిక సరికాదు. ఇస్మార్ట్ శంకర్ ఇటీవలే రిలీజైన సినిమా. అందువల్ల ఉండే క్రేజు వేరు. అయితే వినయ విధేయ రామ కంటే ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాని ఆ టైమ్ లో వేసినా అంతకుమించిన అద్భుతమైన రేటింగునే దక్కించుకుని ఉండేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఒక హిట్టు సినిమాకి ఫ్లాప్ సినిమాకి ఉన్న తేడాను కూడా ఈ టీఆర్పీ ఎలివేట్ చేసి చెబుతోంది. ఇక చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రానికి 19.8 టీఆర్పీ వచ్చింది అప్పట్లో. ఆ బొమ్మ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అన్నట్టే బుల్లితెరపైనా దూసుకుపోయింది. బాహుబలి సిరీస్ తో పాటు రంగస్థలం లాంటి చిత్రాలకు బుల్లితెరపై అద్భుత ఆదరణ దక్కుతోంది. ఈ సినిమాల్ని చూసేందుకు పదే పదే టీవీక్షకులు వెంపర్లాడుతున్నారని ప్రూవైంది. వినయ విధేయ రామా.. ఇస్మార్ట్ శంకర్ చిత్రాల టీఆర్పీల్ని స్టార్ డమ్ దృష్ట్యా చూస్తే.. టీఆర్పీ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్! అన్న చందంగానే ఉంది మరి.