Begin typing your search above and press return to search.
నిజంగా ఇది పూరి మార్కు విజయమేనా ?
By: Tupaki Desk | 21 July 2019 1:30 AM GMTఒకప్పుడు పూరి జగన్నాథ్ అనే దర్శకుడు వింటేజ్ క్లాసిక్స్ తీసిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్. ఓ సున్నితమైన సమస్యను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంగా తీసినా ప్రేమకథకు కమర్షియల్ వాల్యూస్ అద్ది బద్రి అనిపించినా హీరోయిజంకు కొత్త అర్థం చెబుతూ పోకిరితో రికార్డులు బద్దలు కొట్టినా రవితేజ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇడియట్ తో వెనక్కు చూసుకోనక్కర్లేని బ్రేక్ ఇచ్చినా అది ఇతనికే చెల్లింది.
వీటిలో ఎక్కడా హద్దులు మీరిన అసభ్యత కాని శృతి మించిన అశ్లీలత కాని మచ్చుకు కూడా కనిపించదు. ఎన్ని మాస్ మసాలాలు ఉన్నా కుటుంబ ప్రేక్షకులు అన్ని వర్గాలు ఆమోదించే రీతిలో ఉండేవి కాబట్టే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటికీ టీవీలో ఎన్నిసార్లు వచ్చినా ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్స్ గానే నిలిచాయి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో హృద్యంగా చిత్రీకరించిన తల్లి కొడుకుల ఎమోషనల్ థ్రెడ్ కి కరగని హృదయాలు లేవు
ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఇస్మార్ట్ శంకర్ తో పూరి హిట్టు కొట్టాడు. వసూళ్లు బాగున్నాయి. మాస్ సినిమా లేక కరువుతో ఉన్న బాక్స్ ఆఫీస్ రెండు రోజుల నుంచి కళకళలాడుతోంది. ఇది ఓ రెండు వారాలైనా ఉంటుందా అంటే ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేం కాని ఇంకో నాలుగు రోజులు ఆగాలి. కాని ఇప్పుడిది పైన చెప్పుకున్న వింటేజ్ పూరి సినిమానా అని అడిగితే పైకి సమాధానం అభిమానులు ఔను అని చెప్పినా లోపల హృదయం మాత్రం కాదు అనే అంటుంది.
మాస్ పేరుతో సరైన తీరు లేని హీరో క్యారెక్టరైజేషన్ అతిగా ప్రవర్తించే హీరొయిన్ బాడీ లాంగ్వేజ్ సినిమా అయ్యాక కనీసం మొహం కూడా గుర్తుకు రాని విలన్ పాత్ర వెరసి ఎంత హిట్టు కొట్టినా ఇది గర్వంగా పూరి సినిమా అని చెప్పుకునేలా ఇస్మార్ట్ శంకర్ ఉందా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి. వసూళ్ళ లెక్కలే ప్రతిసారి దర్శకుడి ప్రతిభకు కొలమానం కావు. మాస్ క్లాసు భేదం లేకుండా అందరూ చూసినప్పుడే ఏ సినిమా అయినా యునానిమస్ హిట్ గా నిలుస్తుంది. గతంలో పూరి తీసినవి అలాంటివే. మళ్ళి ఆ శకం పూరి నుంచి రావాలనేదే అందరి ఆకాంక్ష