Begin typing your search above and press return to search.

యుఎస్ లో పండని స్మార్ట్ మసాలా

By:  Tupaki Desk   |   22 July 2019 5:37 AM GMT
యుఎస్ లో పండని స్మార్ట్ మసాలా
X
గత నాలుగు రోజులు బాక్స్ ఆఫీస్ ని పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకున్న ఇస్మార్ట్ శంకర్ ఇవాళ నుంచి మరో పరీక్షను ఎదురుకోబోతున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యిందనే టాక్ ఉండగా ఇవాళ నుంచి తెగే ప్రతి టికెట్ లాభం కిందకే వస్తుందని బయ్యర్లు అంటున్నారు. పూర్తి క్లారిటీ ఇంకో రెండు రోజుల్లో వచ్చేస్తుంది. థియేట్రికల్ బిజినెస్ 16 కోట్లకు అటుఇటుగా చేయడంతో రీజనబుల్ ప్రాఫిట్స్ తో కొన్నవాళ్ళు సేఫ్ కావడం ఖాయమే.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉండగా యుఎస్ లో ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాడు. వీక్ ఎండ్ లో మూడు రోజులు కలిపి ప్రీమియర్ షోతో సహా కేవలం $215K మాత్రమే వసూలు చేయడం అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెబుతోంది. దీని కన్నా బ్రోచేవారెవరుగా ఫస్ట్ వీక్ లో ఓ ఇరవై వేల డాలర్లు ఎక్కువ రావడం గమనార్హం. ఒక్క శనివారం మాత్రమే ఇస్మార్ట్ శంకర్ ఎక్చూకువ పెరుగుదలపించాడు. బుధవారం $51677Kతో ఓపెన్ కాగా గురువారం $31477 శుక్రవారం $41579 శనివారం $56898 ఆదివారం $30K దాకా రాబట్టి ఆశించిన వసూళ్లు రాబట్టుకోలేకపోయాడు.

ఒకరకంగా చెప్పాలంటే ఇండియాలో వస్తున్న రన్ కి ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ కు ఏ మాత్రం పొంతన లేదు. అక్కడ మాస్ సినిమాలు ఆడేది తక్కువే అయినా కంటెంట్ ఉంటే ఆడతాయని గతంలో మహేష్ పవన్ చిరుల సినిమాలు రుజువు చేశాయి. కానీ వాళ్ళ స్థాయిలో మెప్పించే కంటెంట్ ఇస్మార్ట్ శంకర్ లో పూర్తిగా లేకపోవడంతో ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ లెక్కన మిలియన్ మార్క్ గురించి ఇస్మార్ట్ శంకర్ ఆలోచించకపోతే బెటర్. మరోవైపు ఓ బేబీ మిలియన్ డాలర్ మార్క్ కు కేవలం ముప్పై వేల డాలర్ల దూరంలో ఉంది.