Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ శంక‌ర్ అస‌లు లెక్క ఇదీ

By:  Tupaki Desk   |   17 July 2019 8:19 AM GMT
ఇస్మార్ట్ శంక‌ర్ అస‌లు లెక్క ఇదీ
X
ఎన‌ర్జిటిక్ రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంక‌ర్` ట్రైల‌ర్ వ‌చ్చింది మొద‌లు ఈ సినిమాపై ర‌క‌ర‌కాల వివాదాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. నైజాం యాస‌ను సంస్కృతిని కించ‌ప‌రిచేలా రామ్ పాత్ర‌ను తీర్చిదిద్దార‌ని ప‌లువురు విమ‌ర్శించారు. క‌థానాయిక‌ల బోల్డ్ అవ‌తారాల‌పైనా విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అయితే ఇవే వివాదాలు ఈ సినిమా ఓపెనింగుల‌కు క‌లిసొస్తున్నాయ‌ని తాజాగా రిపోర్ట్ అందింది. ఇక‌పోతే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో తిరిగి కెరీర్ ప‌రంగా రీబూట్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న పూరి-రామ్ ఇద్ద‌రూ ఎంతో క‌సిగా ప‌ని చేశార‌ని ఆ క్ర‌మంలోనే ఈసారి హిట్టు కొడ‌తార‌ని ఇండ‌స్ట్రీ ఇన్ సైడ్ స‌ర్కిల్స్ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి.

అంతేకాదు ఇస్మార్ట్ శంక‌ర్ ప్రీరిలీజ్ బిజినెస్ అదిరిపోయింద‌ని.. రిలీజ్ కి ముందే 38.50 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ద‌క్కింద‌ని ప్ర‌చార‌మైంది. పూరి- ఛార్మి కాంబో బ్యాన‌ర్ పూరి కనెక్ట్స్ ఈసారి లాభాలు దండుకుంటుంద‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది ప‌రిశీలిస్తే అస‌లు నిజం వేరొక‌లా ఉంది. ఇదివ‌ర‌కూ ఇస్మార్ట్ శంక‌ర్ ప్రీబిజినెస్ పై కొన్ని డ‌మ్మీ ఫిగర్స్ వ‌చ్చాయి. అస‌లు ఒరిజిన‌ల్ గా ఈ సినిమాకి థియేట్రిక‌ల్ బిజినెస్ ఎంత‌కు పూర్త‌యింది? అన్న‌ది ప‌రిశీలిస్తే తాజాగా ఆస‌క్తిక‌ర సంగ‌తులు రివీల‌య్యాయి.

ఇస్మార్ట్ శంక‌ర్ అస‌లు లెక్క ఇదీ అంటూ ట్రేడ్ లో తాజాగా చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 17 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ సాగింది. దీనికి అద‌నంగా శాటిలైట్-ఆడియో- డిజిట‌ల్ రైట్స్ క‌లిసిరానున్నాయ‌ని తెలుస్తోంది. ఏరియా వైజ్ ప్రీరిలీజ్ బిజినెస్ వ‌సూళ్ల లెక్క‌లు ప‌రిశీలిస్తే.. తూ.గో జిల్లా- 1.05 కోట్లు.. ప‌.గో జిల్లా-90ల‌క్ష‌లు.. యుఏ -1.40 కోట్లు.. గుంటూరు -1.10కోట్లు.. నైజాం- 6.50 కోట్లు.. సీడెడ్ -2.52కోట్లు.. కృష్ణ‌-95ల‌క్ష‌లు.. నెల్లూరు-48 ల‌క్ష‌లు మేర బిజినెస్ పూర్త‌యింది. ఓవ‌రాల్ ఆంధ్రా- తెలంగాణ క‌లుపుకుని 14.90 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఓవ‌ర్సీస్ 90ల‌క్ష‌ల మేర బిజినెస్ చేయ‌గా .. ఇత‌ర‌త్రా భార‌త‌దేశంలో 1.20 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేశారు. ఇదీ ఇస్మార్ట్ బిజినెస్ అస‌లు లెక్క‌. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రానికి 17 కోట్ల మేర టేబుల్ పైకి వ‌చ్చింది. రూ.17- 20 కోట్ల మేర థియేట్రిక‌ల్ షేర్ వ‌సూలు చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్లు సేఫ్ అయిన‌ట్టేన‌ని భావిస్తున్నారు.