Begin typing your search above and press return to search.

రెబ‌ల్ స్టార్‌కు త‌ల‌కొరివి పెట్టేది ప్ర‌భాస్ కాదా.. అత‌డేనా?!

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:32 AM GMT
రెబ‌ల్ స్టార్‌కు త‌ల‌కొరివి పెట్టేది ప్ర‌భాస్ కాదా.. అత‌డేనా?!
X
కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్, వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో సెప్టెంబ‌ర్ 11న ఆదివారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు ఆయ‌న‌కు ఘ‌న‌నివాళులు అర్పించారు. పలువురు సినీ ప్ర‌ముఖులు, రాజకీయ ప్ర‌ముఖులు ఆయ‌న ఆక‌స్మిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

కాగా కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్‌లోని మోయినాబాద్‌లో ప్ర‌భుత్వ లాంచ‌నాల‌తో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మోయినాబాద్‌లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

మొద‌ట జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌గా ఆ త‌ర్వాత అంత్య‌క్రియ‌ల‌ను మోయినాబాద్ లోని మూడున్న‌ర ఎక‌రాల ఫామ్ హౌసులో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా కృష్ణంరాజుకు త‌ల‌కొరివి ప్ర‌భాస్ పెడ‌తాడ‌ని అంతా అనుకున్నారు. వార్త‌లు కూడా అలాగే వ‌చ్చాయి. అయితే ప్ర‌భాస్ కు బ‌దులుగా అత‌డి సోదరుడు ప్ర‌భోద్ త‌ల‌కొరివి పెడ‌తార‌ని చెబుతున్నారు.

అలాగే సెప్టెంబ‌ర్ 12న ఉద‌యం అంత్య‌క్రియ‌లు జ‌ర‌పాల‌ని మొద‌ట నిర్ణ‌యించ‌గా పండితుల సూచ‌న‌ల మేర‌కు అంత్య‌క్రియ‌ల‌ను సాయంత్రానికి మార్చారు. ఈ నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. దీంతో త‌మ అభిమాన న‌టుడు, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు చివ‌రి చూపు కోసం అభిమానులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.

సాయంత్రం ఆయ‌న‌కు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కృష్ణంరాజు మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన మ‌ర‌ణించారు. దీంతో అక్కడే ఆయ‌న అంత్యకక్రియలు నిర్వహించాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు.

కాగా కృష్ణంరాజు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున మంత్రులు... చెల్లుబోయిన శ్రీనివాస‌ వేణుగోపాలకృష్ణ, ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, చీఫ్‌ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరు కానున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.