Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఒకే స్క్రిప్టు తారుమారు.. అయినా కానీ?

By:  Tupaki Desk   |   24 July 2021 9:30 AM GMT
ట్రెండీ టాక్‌: ఒకే స్క్రిప్టు తారుమారు.. అయినా కానీ?
X
ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. బ్యాలెన్స్ షూటింగ్ లో యూనిట్ బిజీగా ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి యూనిట్ సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంత‌రం చిరంజీవి బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయింది. ప్ర‌స్తుతం బాబి న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల ఎంపిక‌లో బిజీగా ఉన్నారు. అలాగే ప‌రిశ్ర‌మ‌లోని టాప్ క్లాస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ని తీసుకోవాల‌ని సీరియ‌స్ గా సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కొచ్చింది. మ‌రి ఇది వాస్త‌వ‌మా? అవాస్త‌వ‌మా? అన్న‌ది తెలియ‌దు గానీ సోష‌ల్ మీడియాని మాత్రం ఈ వార్త ఇప్పుడు షేక్ చేస్తోంది. ఆ క‌థ‌నాల ప్ర‌కారం.. చిరుకి వినిపించిన ఇదే స్క్రిప్టును బాబి గ‌తంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు వినిపించాడ‌ని.. కానీ అత‌ని డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో చిరంజీవికి త‌గ్గ‌ట్టు మ‌లుచుకుని వ‌చ్చిన‌ట్లు ప్రచారం సాగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం నిమ‌జైతే ఎంచుకున్న‌ కాన్సెప్ట్ కూడా యూనిర్శ‌ల్ అయి ఉండాలి. అప్పుడే బాబి మెగాస్టార్ ని అప్రోచ్ అయి క‌నిన్స్ చేసేందుకు ఛాన్సుంటుంద‌ని భావించాలి.

నిజానికి హీరోల ఏజ్ ని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకునే ద‌ర్శ‌కులు క‌థ‌ల్ని ఎంచుకుంటారు. కానీ దేవ‌ర‌కొండ‌.. చిరు స్క్రిప్టు తారుమారు అంశం న‌మ్మ‌బుల్ గా లేద‌ని కొంద‌రు అంటున్నారు. ఇది ప‌క్కా ఫేక్ న్యూస్ గానే భావించాల‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి వ‌య‌సుకి .. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ కి..వ‌య‌సుకి చాలా తేడా ఉంది. దేవ‌ర‌కొండ ఇంకా న‌ల‌భై ఏళ్ల లోపే ఉన్నారు. కానీ చిరంజీవికి 60 ఏళ్లు దాటాయి. మ‌రి అంత వ‌య‌సు వ్య‌త్యాసం ఉన్న హీరోలిద్ద‌రికి స‌రిపోయేలా బాబి ఒకే స్క్రిప్టును ఎందుకు రాస్తారు? అన్న సందేహం రాక మాన‌దు. ఒక వేళ స్క్రిప్టు యూనివ‌ర్శ‌ల్ అంశాల‌తో ఉన్నా పాత్ర‌ల్లో వ్య‌త్యాసాన్ని స‌రిదిద్దాల్సి ఉంటుంది. మ‌రి ఇన్ని ర‌కాల సందేహాల న‌డుమ బాబి ఎలా మ్యానేజ్ చేశారు? ఆ ఇద్ద‌రికీ వేర్వేరు స్క్రిప్టుల‌ను వినిపించారా..! లేక ఇంకేదైనా జ‌రిగిందా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. వ‌రుస స‌క్సెస్ ల‌తో స్వ‌యంకృషితో నైజాం మెగాస్టార్ గా పాపుల‌రైన దేవ‌ర‌కొండ‌కు వినిపించిన‌ది వేరే ఒకటి అయినా దానిపై బాబి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

#ChiruBday2020 డెడ్ లైన్ ..!

ఆగ‌స్టు 22.. బిగ్ డే.. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు.. స‌రిగ్గా ఇంకో 50రోజుల్లో బ‌ర్త్ డే ఉంద‌న‌గా అప్పుడే సీడీపీని ప్రారంభించి మెగాభిమానులు సోష‌ల్ మీడియాల్లో సంద‌డి చేస్తున్నారు. మునుప‌టితో పోలిస్తే ఈసారి మెగా బ‌ర్త్ డేకి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. మెగాస్టార్ కొన్ని ద‌శాబ్ధాల క్రిత‌మే బ్ల‌డ్ బ్యాంక్- ఐ బ్యాంక్ వంటివి ప్రారంభించి ప్ర‌జాసేవ‌లో ఉన్నారు. సామాజిక సేవ ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. ద‌శాబ్ధాలుగా అభిమానులు ఆయ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఈసారి క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో మెగాస్టార్ చిరంజీవి మెగా సేవ‌లు పదింత‌ల‌య్యాయి. క‌ష్టంలో నిజంగానే దేవుడ‌య్యారు. రెండు సార్లు క‌రోనా మ‌హ‌మ్మారీ త‌రుముకొస్తే ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను చూడ‌లేక ఆయ‌న చేసిన సాయం అంతా ఇంతా కాదు. క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఆరంభం సినీకార్మికులు జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌ను స‌హా ఎంద‌రినో ఆదుకున్నారు మెగాస్టార్. క‌నీస నిత్యావ‌స‌రాల్ని నెల‌ల‌పాటు స‌రిప‌డేలా స‌ర‌ఫ‌రా చేశారు.

సెకండ్ వేవ్ స‌మ‌యంలో అంత‌కుమించి ఆయ‌న సేవ‌ల్ని విస్త‌రించారు. ఓవైపు క‌రోనా రోగులు స‌రైన స‌మ‌యంలో ఆక్సిజ‌న్ అంద‌క‌ ప్ర‌ణాలు విడుస్తుంటే ప‌రిస్థితి తెలుగు ప్ర‌జ‌ల‌కు క‌ల‌గ‌కూడ‌ద‌ని భావించి వెంట‌నే ఇరు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లోనూ చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించారు. ఆప‌ద‌లో అన్నం పెట్ట‌డ‌మే కాదు ప్రాణ‌దానం చేయ‌గ‌ల‌మ‌ని మ‌రోసారి మెగాస్టార్ నిరూపించారు. అందుకే ఈసారి బ‌ర్త్ డే ఎంతో ప్ర‌త్యేకం. అఖిల భారత చిరంజీవి యువత ఇప్పటికే బిగ్ డే కోసం ముందుగానే ప్రణాళిక వేసింది. ఈ సంవత్సరం వారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చేయవలసిన కొత్త నినాదాన్ని విడుదల చేశారు. దేశాన్ని ప్ర‌పంచాన్ని మహమ్మారి పీడించిన‌ట్టు మునుముందు ప‌ర్యావ‌ర‌ణం ప్ర‌మాద‌క‌రంగా మార‌నుంది. అందుకే చిరంజీవి నుండి ప్రేరణ పొంది ``పర్యావరణాన్ని కాపాడటానికి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు బాధ్య‌త‌గా ఒక మొక్కను నాటాలి!`` అనే నినాదాన్ని తెర‌పైకి తెచ్చారు. ఆగస్టు 9 నుండి ఆగస్టు 22 వరకు వారు ప్రతి మెగా అభిమానిని తొమ్మిది మొక్కలు నాటాలని ఆదేశాలు అందుకున్నారు. ప్ర‌స్తుతం ChiruBday2020 వైర‌ల్ గా మారుతోంది.

మెగాస్టార్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న ఆచార్య త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్ లో న‌టిస్తారు. బ్యాక్ టు బ్యాక్ న‌లుగురు ద‌ర్శ‌కుల్ని ఆయ‌న ఫైన‌ల్ చేసి స్క్రిప్టు ప‌నిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.