Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కి కొత్త సవాళ్లు..ఇలాగైతే కష్టమే!
By: Tupaki Desk | 16 Dec 2022 7:30 AM GMTబాలీవుడ్ పరిశ్రమ కొత్త సవాళ్లు ఎదుర్కోంటుందా? వాటిని ఎదుర్కోవడంలో ఇండస్ర్టీ విఫలమవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే పరిశ్రమకి సరైన విజయాలు లేక ఆర్ధిక సంక్షోభంలో పడింది. కోవిడ్ దగ్గర నుంచి ఇండస్ర్టీ పరిస్థితి అలాగే ఉంది. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మినహా భారీ బడ్జెట్ సినిమాలు....స్టార్ హీరోల చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతున్నాయి.
దీనికి తోడు కొత్తగా బోయ్ కట్ ట్రెండ్ అంటూ ఒకటి సోషల్మీడియాలో మొదలైంది. పొర పాటున ఎక్కడైనా మీడియా సమావేశాల్లో నోరు జారినితే నెటి జనులు వాళ్లు అంతు చూసే వరకూ వదలడం లేదు. ఆహీరో సినిమా ని బ్యాన్ చేయాలి..బోయ్ కట్ చేయండి అంటూ సామాజక మాధ్యమాల వేదికగా పిలుపునివ్వడం..దాన్ని సక్సెస్ చేయడం ఓ పనిగా భావించి ముందుకెళ్తున్నారు కొందరు.
సోషల్ మీడియాలో పిలుపు ఇచ్చినంత మాత్రాన జరిగిపోతుందా? అని పొరబడితే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగిపోతుంది. అందుకు 'లాల్ సింగ్ చడ్డా'ని ప్రధానంగా ఉదహరించవచ్చు. తొలి రోజే 50 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చే సత్తా ఉన్న హీరో సినిమా 12 కోట్లు తెచ్చిందంటే? ఆ ప్రభావం ఎంత బలంగా పడిందన్నది గెస్ చేయోచ్చు. అటుపై అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమా విషయంలో దాదాపు ఇలాంటి సన్నివేశమే పాక్షికంగా కనిపించింది.
తాజాగా బాద్ షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న 'పఠాన్' సినిమా రిలీజ్ విషయంలో ఇదే సన్నివేశం ఎదురయ్యేలా ఉంది. ఇప్పటికే షారుక్ దిష్టిబొమ్మల్ని రోడ్డుపై దహనం చేయడం దేశ వ్యాప్తంగా ఎంత సంచలమైందో తెలిసిందే. షారుక్ కి ఇలాంటి అనుభవాలు కొత్తేం కాదు గతంలో ఇలాంటి సన్నివేశాలు ఎదుర్కున్నాడు. అయితే ఇప్పుడు అంతకుమించి బలమైన ప్రతికూలత ఎదురవుతున్నట్లు కనిపిస్తుంది.
మరి వీటిని బాలీవుడ్ ఎలా పరిగణించాలంటే? అంటే! ఇవి పరిశ్రమకి అతి పెద్ద సవాళ్లనే చెప్పాలి. ప్రస్తుత పొలిటికల్ సినారైలో హీరోలందరూ ఏదో రూపంలో ప్రజలు సహా రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గడిచినన ధశాబ్ధంలో ఈ సన్నివేశం ఎక్కువగా కనిపిస్తుంది. వస్తోన్న వ్యతిరేకతను తొలగించుకోవడంలో హీరోలు విఫలమవుతున్నారు.
వాళ్ల వ్యాఖ్యలు ఢీ అంటే ఢీ అన్న చందంగానే కనిపిస్తున్నాయి. లాల్ సింగ్ చడ్డా సినిమాకి కోట్ల రూపాయల నష్టం వచ్చినా అమీర్ ఖాన్ తగ్గేదేలే అంటూ తనపై వచ్చిన వ్యతిరేకతని సమర్దించుకున్న ప్రయత్నం కళ్ల ముందు కనిపించిందే. షారుక్ ఖాన్ కూడా ఈవిషయాలు పెద్దగా చెవికెక్కించుకున్నట్లు కనిపించలేదు. ఆయన అదే చేస్తే ! మళ్లీ అదే సన్నివేశం ఎందుకు రిపీట్ అవుతుంది? ఈ సమస్యలన్నింటిపై ఇండస్ర్టీ సమిష్టిగా పోరాటం చేస్తే తప్ప! సఫలీకృతం అవ్వడం కష్టం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.