Begin typing your search above and press return to search.

న‌య‌న్ - విఘ్నేష్ ల చుట్టూ ముదురుతున్న వివాదం!

By:  Tupaki Desk   |   13 Oct 2022 7:25 AM GMT
న‌య‌న్ - విఘ్నేష్ ల చుట్టూ ముదురుతున్న వివాదం!
X
కోలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు గ‌త ఆదివారం అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తాము త‌ల్లిదండ్ర‌లైన‌ట్టుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించి త‌మ ఆనందాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. మాకు ఇద్ద‌రు ట్విన్ బాయ్స్ జ‌న్మించార‌ని, త‌మ పిల్ల‌ల‌ని ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు క‌ల‌వ‌ల పాదాల‌ని ముద్దాడుతున్న ఫొటోల‌ని షోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు.

పెళ్లై నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ దంప‌తులు పేరెంట్స్ కావ‌డంతో స‌రోగ‌సీ ద్వారానే వీరు సంతానాన్ని పొందార‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీంతో ఈ జంట సంతానంపై త‌మిళ నాట తీవ్ర దుమారం మొద‌లైంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది న‌య‌న దంప‌తుల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సుప్రీం కోర్టు నిషేధించిన స‌రోగ‌సీ విధానంని ఈ దంప‌తులు ఎలా అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో న‌య‌న దంప‌తుల చుట్టూ వివాదం మొద‌లైంది.

విష‌యం చ‌ర్చ‌కు దారితీయ‌డంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ దీనిపై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టింది. సంబంధిత ఆరోగ్య శాఖ‌కు చెందిన మంత్రి ఎం. సుబ్రమ‌ణియ‌న్ దీనిపై ఇటీవ‌ల స్పందించిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ వివాదంపై ఆరా తీయ‌డం మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోది. స‌రోగ‌సీ అంశంలో న‌య‌న దంప‌తుల‌కు స‌హ‌రించిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యంపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. గురువారం మెడిక‌ల్ డైరెక్ట‌రేట్ కు చెందిన ప‌లువురు ఉన్న‌తాధికారులు విచార‌ణ మొద‌లు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జూన్ 9న న‌య‌న్‌, విఘ్నేష్ శివ‌న్ లు వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే స‌రోగ‌సీ విధానం వ‌ల్ల వీరు పిల్ల‌ల‌ని క‌నాలంటే వీరి పెళ్లై ఐదేళ్లు పూర్తి కావాల‌ట‌. కానీ వీరికి పెళ్లై ఐదు నెల‌లు కూడా తిర‌గ‌కుండానే క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం ఇప్ప‌డు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. న‌య‌న‌తార‌కు స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌ల‌ని క‌నొచ్చ‌ని, వారే ద‌గ్గ‌రుండి ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రి వైద్యులు ఇదంతా చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం దీనిపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్ట‌డంతో న‌య‌న దంప‌ల చుట్టూ వివాదం ముదురుతోంది.

స‌రోగ‌సీ విధానం గురించి, ఆ త‌రువాత ఎదుర‌య్యే లీగ‌ల్ చిక్కుల గురించి న‌య‌న‌తార దంప‌తుల‌కు డాక్ట‌ర్లు వివ‌రించారా? ..నియ‌మ‌నిబంధ‌న‌లు తెలియ‌జేశారా? అలా చేస్తే న‌య‌న దంప‌తులు లీగ‌ల్ చిక్కుల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డొచ్చు? .. ఒక వేళ నిబంధ‌న‌ల్ని అధిగ‌మించార‌ని తేలితే న‌య‌న దంప‌తులు జ‌రిమానాతో బ‌య‌ట‌ప‌డ‌తారా? లేక ఇంకా వివాదంలో చిక్కుకుంటారా? అన్న‌ది తేలాల్సి వుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.