Begin typing your search above and press return to search.
ప్రొడ్యూసర్స్ సైలెన్స్..హీరోలు కూడా అంతే..!
By: Tupaki Desk | 23 Nov 2022 3:30 PM GMT2023 సంక్రాంతి సమరం మొదలు కాకుండానే థియేటర్స్ విషయంలో పెద్ద రచ్చకు తెర లేపిన విషయం తెలిసిందే. పండగ సీజన్ సమయంలో తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత నివ్వాలని నిర్మాతల మండలి చేసిన ప్రకటన ఇప్పడు తమిళ, తెలుగు నిర్మాతల మధ్య సరికొత్త వివాదానికి తెర లేపింది. దీనిపై తమిళ నిర్మాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా రీపెంట్ గా తమిళ దర్శకుడు లింగుస్వామి వివాదాస్పదంగా స్పందించి వివాదాన్ని మరింత పెద్దది చేయడం తెలిసిందే.
దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా 'వారీసు'ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనివ్వని పక్షంలో 'వారీసు'కు ముందు సినిమా.. 'వారీసు' తరువాత సినిమా అనే స్థాయిలో పరిస్థితులు మారతాయంటూ లింగుస్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం.. అలా డబ్బింగ్ సినిమాల రిలీజ్ లని ఆపేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని టీఎఫ్‌పీసీ కార్యదర్శ ప్రసన్నకుమార్ వివరణ ఇవ్వడం తెలిసిందే. అంతుకు ముందే ఈ వివాదంపై అల్లు అరవింద్ తనదైన స్టైల్లో స్పందించారు.
డబ్బింగ్ సినిమాల రిలీజ్ లని ఆపడం సాధ్యం కాదని, అది మంచి పద్దతి కాదన్నారు. ఇండైరెక్ట్ గా దిల్ రాజు 'వారీసు'కు మద్దతుగా మాట్లాడారు. ఇక భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ మరో అడుగు ముందుకేసి మైత్రీ వారికి చురకలంటించాడు. టీఎఫ్‌పీసీ ప్రకటనని వెనక్కి తీసుకోవాలన్నారు. అంతే కాకుండా మైత్రీవారు ఒకే సమయంలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే తప్పులేదు కానీ దిల్‌రాజు ఒక సినిమా రిలీజ్ చేస్తే తప్పా.. అంటూ మండిపడ్డారు.
దీంతో ఇష్యూ దిల్ రాజు 'వారీసు' నుంచి మైత్రీ వారి మీదకు మళ్లినట్టయింది. అశ్వనీదత్ .. మైత్రీ వారిని ట్రిగ్రర్ చేయడంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నా.. ఇటు వివాదానికి ప్రధాన కారణంగా నిలిచిన 'వారీసు' ప్రొడ్యూసర్ దిల్ రాజు కానీ.. ఆ మూవీని ఇండైరెక్ట్ గా వార్తల్లో నిలిపిన మైత్రీ మూవీ మేకర్స్ వారు కానీ స్పందించడం లేదు. పెదవి విప్పడం లేదు. మేకర్సే స్పందించట్లేదు కాబట్టి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
అభిమానుల నుంచి ఏదైనా అభ్యంతరాలు వుంటే హీరోలు స్పందించే అవకాశం వుంది. కానీ డైరెక్ట్ గా థియేటర్ల వివాదంపై స్పందించడం కరెక్ట్ కాదని హీరోలు భావిస్తున్నారని చెబుతున్నారు.
గతంలోనూ ప్రొడ్యూసర్ ల విషయంలో చిరు, బాలయ్య పెద్దగా ఇన్ వాల్వ్ కాని విషయం తెలిసిందే. ఫ్యాన్స్ మన సినిమాకు ప్రధాన థియేటర్లకు లభించడం లేదని కంప్లైంట్ చేస్తే తప్ప హీరోలు ఈ వివాదంలోకి ఎంట్రీ ఇవ్వరని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.